నిహారిక ఎంత హాట్‌గా ఉందో.. పెళ్లి కాకముందే ఫియాన్సీతో కలిసి రచ్చ

మెగా డాటర్ నిహారిక సినిమాల్లో కనిపించినా, బుల్లితెరపై సందడి చేసినా పద్దతిగా కనిపించింది. వెబ్ సిరీస్‌లు చేసినా సరే తన హద్దులు ఎప్పుడూ కూడా దాటలేదు. ఎక్స్‌పోజింగ్ ఆమడ దూరంలో ఉంటుంది. మోడ్రన్ డ్రెస్సులు వేసినా ఓ పద్దతి ప్రకారమే వేస్తుంది. మొన్న గోవా పార్టీలో మాత్రమే కొంత డోస్ పెంచింది. అక్కడ కల్చర్‌కు తగ్గట్టు నడుచుకున్నట్టుందేమో. అయితే తాజాగా నిహారిక తన ఫియాన్సీతో కలిసి బయటకు వెళ్లింది.

Chaitanya Shares Niharika Pic Goes Viral
Chaitanya Shares Niharika Pic Goes Viral

మామూలుగా వీళ్లిద్దరూ నిశ్చితార్థం కాకముందే రచ్చ రచ్చ చేశారు. బయట రెస్టారెంట్లకు తిరిగారు. మధ్యలో బర్త్ డేలు వస్తే స్పెషల్ ట్రీట్‌లు ఇచ్చుకున్నారు. ఇక ఈ మధ్య ఇద్దరూ కలిసి జిమ్‌కు వెళ్తున్నారు. జిమ్ పార్ట్నర్స్‌గా మారిన నిహారిక, చైతన్య సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తాజాగా జిమ్‌లో ఇద్దరి కాళ్లను ఒకే వద్ద పెట్టి ఫోటో తీసింది. దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫుల్ ఖుషీ అయింది.

Chaitanya Shares Niharika Pic Goes Viral
Chaitanya Shares Niharika Pic Goes Viral

తాజాగా నిహారిక, చైతన్య అలా బయటకు వెళ్లినట్టు కనిపిస్తోంది. ఇందులో నిహారిక అదిరిపోయే లుక్కులో దర్శనమిచ్చింది. నిహారికలో ఇంత హాట్ నెస్ ఉందా? అని ఆశ్చర్యపోయేలా ఉంది. చైతన్య తన ఇన్ స్టా స్టోరీలో నిహారిక ఫోటోను పెట్టుకున్నాడు. ఆ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. డిసెంబర్‌లో నిహారిక పెళ్లి జరుగుతుందని పెళ్లి కార్యక్రమాలన్నీ వరుణ్ తేజ్ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడని నాగబాబు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.