ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళకు కొదవే లేదు. ఒకరి తర్వాత ఒకరం అన్నట్టు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ పోతూనే ఉన్నారు. కరోనా ఉన్నా కూడా ఏ మాత్రం ఆగే ప్రసక్తే లేదంటూ పెళ్లి పీటలెక్కతున్నారు. ఈ ఏడాది టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, హీరోయిన్స్ పెళ్ళిళ్లు జరిగాయి. కొద్ది రోజుల క్రితం నిహారిక పెళ్లి ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలో మెగా ఫ్యామిలీ హీరోలందరు పార్టిసిపేట్ చేయడంతో మెగా వెడ్డింగ్ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక ఇప్పుడు నందమూరి వంశం టైం వచ్చింది. నందమూరి తారకరామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ పెళ్లి హైదరాబాద్ లోనే డిసెంబర్ 18న ఘనంగా జరిగింది. కాకపోతే ఎలాంటి హడావిడి చేయలేదు. కరోనా వలన కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హిజరైనట్టు తెలుస్తుంది. బాలయ్య ఈ పెళ్లి వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ కాగా, నూతన దంపతులకి ఆశీర్వచనాలు అందించారు. ఈ పెళ్లి కార్యక్రమాలతో బిజీగా ఉండడ వలననే దిల్ రాజు బర్త్‌డేకు నందమూరి కుటుంబం నుండి ఎవరు రాలేదని తెలుస్తుంది.
డిసెంబర్ 6న రేఖా వాణితో చైతన్య కృష్ణ నిశ్చితార్ధం ఘనంగా జరగగా ఈ కార్యక్రమానికి కూడా బాలయ్య హాజరయ్యారు. ఎప్పటి నుండో పెళ్ళి సంబంధాలు చూస్తుండగా, ఇన్నాళ్ళకు కుదిరిందట. బాలయ్య ఇద్దరు కూతుళ్ళు, కొడుకు మోక్షజ్ఞ, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయడు తదితరులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నందమూరి తారకరామారావు కొడుకు జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ కాగా, ఈయన 2003 సంవత్సరంలో జగపతిబాబు హీరోగా వచ్చిన ధమ్ సినిమాలో మరో హీరోగా నటించాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో రాజకీయాల వైపు దృష్టి సారించాడు. అప్పుడప్పుడు తెలుగ దేశం తరపున తన వాయిస్ వినిపిస్తూనే ఉంటాడు