మెగా బ్రదర్ నాగబాబు బర్త్ డే నేడు (అక్టోబర్ 29). ఈ మేరకు సోషల్ మీడియాలో విషెస్ వెళ్లువెత్తుతున్నాయి. ఎవరు ఎంత గొప్పగా విషెస్ చెప్పినా మెగాస్టార్ చిరంజీవి, కూతురు నిహారిక, కొడుకు వరుణ్ తేజ్ చెప్పే విషెస్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయి. ఆ లిస్ట్‌లోకి ఇప్పుడు ఇంకొకరు వచ్చారు. అదే కాబోయే అల్లుడు. నిహారికను చేసుకుని మెగా ఇంటికి అల్లుడు అవ్వబోతోన్న చైతన్య జొన్నలగడ్డ చెప్పే విషెస్ మరింత స్పెషల్ అవుతాయి.
అయితే చైతన్య విషెస్ చెప్పేందుకు ఓ స్పెషల్ ఫోటోను ఎంచుకున్నాడు. నిహారిక షేర్ చేసిన ఫోటోనే తీసుకుని చైతన్య తన మామకు విషెస్ తెలిపాడు. నిహారిక తన చిన్ననాటి ఫోటోను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే నాన్నా.. ఇంకా సరదాగా ఉండాలి.. ఇంకా హ్యాండ్సమ్‌గా కావాలి.. రోజురోజుకూ యంగ్‌గా తయారవ్వాలి అంటూ విషెస్ తెలిపింది. తాజాగా నిహారిక ఫియాన్సీ చైతన్య చెప్పిన విషెస్ దానికి నాగబాబు ఇచ్చిన రిప్లై తెగ వైరల్ అవుతున్నాయి.
హ్యాపీ బర్త్ డే మావయ్య.. ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి.. అంటూ చైతన్య నాగబాబుకు స్పెషల్ విషెస్ చెప్పాడు. ఇక తనకు విషెస్ చెప్పినందుకు నాగబాబు తిరిగి రిప్లై ఇచ్చాడు. థాంక్యూ చైతన్య.. లవ్యూ మై బాయ్ అంటూ అల్లుడిపై ప్రేమను కురిపించాడు. మొత్తానికి మామా అల్లుళ్లు మధ్య మంచి బాండింగే ఏర్పడినట్టు కనిపిస్తోంది. నిహారిక, చైతన్యల పెళ్లి డిసెంబర్‌లో జరిగేట్టు తెలుస్తోంది. ఈ మేరకు వరుణ్ తేజ్ పెళ్లి బాధ్యతలను తీసుకున్నట్టు నాగబాబు పేర్కొన్నాడు.