చావులోనూ ప్రేమను వెతుక్కుని కిక్ ఇచ్చిన హీరో

Chaavu Kaburu Challaga
Chaavu Kaburu Challaga
Chaavu Kaburu Challaga

ఈరోజుల్లో కొత్తదనం ఉంటేనే ప్రేక్షకులు సినిమా వైపు చూస్తున్నారు. అందుకే యువ హీరోలు క్రేజీ కాన్సెప్ట్, కొత్త తరహా కథలు అంటున్నారు. తాజాగా ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటించిన ‘చావు కబురు చల్లగా’ సినిమా ట్రైలర్ చూస్తే ఈ సంగతి అర్థమవుతుయింది. చావు ఇంట్లో ప్రేమను వెతుక్కునేది హీరో క్యారెక్టర్, స్కూలుకు వెళ్లే కుర్రాడు స్కూల్లో ఆఫీసుకు వెళ్లే వాడు ఆఫీసులో ప్రేమను వెతుక్కుంటాడు. అలాగే ఎప్పుడూ చావు ఇళ్లకు వెళ్లే నేను అక్కడ కాక ఇంకెక్కడ ప్రేమను వెతుక్కుంటాను అంటాడు హీరో. అక్కడితో సినిమా పాయింట్ ఫ్రెష్ అని తేలిపోయింది. ఫన్ పండించడానికి కావాల్సినంత స్టఫ్ దొరికేసింది అక్కడ.

భర్త చనిపోయి బాధలో ఉన్న అమ్మాయికి భర్త శవం ముందే ఒకడు లైన్ వేయడమనేది ప్రేక్షకుల్ని బాగా హుక్ చేస్తుంది. ‘చావు కబురు చల్లగా’ ట్రైలర్ చూస్తే అలానే ఉంది. ఇక కథలో కాన్ ఫ్లిక్ట్ బాగుంటే సినిమా హిట్ అయినట్టే. ఈ అంశాలన్నీ ఉన్నాయి కాబట్టే కార్తికేయ ఆ సినిమాను ఒప్పుకున్నట్టు ఉన్నారు. సినిమాలో ఆయన నటన, పాత్ర చిత్రీకరణ కూడ భిన్నంగా ఉన్నాయి. దర్శకుడు కౌశిక్ వీటన్నింటినీ సరిగ్గా సెట్ చేసుకున్నారు. జెక్స్ బిజోయ్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం బాగా కుదిరింది. ఫన్నీ సీన్లు బాగా పడ్డాయి. ట్రైలర్ తో మంచి పాయింట్ పట్టుకున్నారని పేరు తెచ్చుకున్న చిత్ర బృందం సినిమాతో కూడ అదే నమ్మకాన్ని నిలబెట్టుకుంటే హిట్ ఖాయం.

Chaavu Kaburu Challaga - Official Trailer | Kartikeya, Lavanya Tripathi | Koushik | #CKCTrailer