క‌ర్వా చౌత్ వేడుక‌లో కాజ‌ల్ క‌నువిందు.. వైర‌ల్‌గా మారిన అందాల భామ‌ల ఫొటోలు

భార‌తీయులకి సంబంధించిన ముఖ్య‌మైన పండుగ‌ల‌లో క‌ర్వా చౌత్ పండుగ ఒక‌టి. దీనిని అంద‌రు ఎంతో ఉత్సాహంగా జ‌రుపుకున్నారు. సామాన్యులు,సెల‌బ్రిటీలు అనే తేడా లేకుండా జ‌రుపుకున్న ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెళ్లి అయిన మహిళలు తమ భర్త కోసం, పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు తమకు కాబోయే భ‌ర్త‌ యోగక్షేమాలు కోరుతూ సంతోషంగా జ‌రుపుకోవ‌డం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి అట్ల త‌ద్ది పేరుతో ఈ వేడుక జ‌రుపుకోగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

ఇక బాలీవుడ్ ప‌రిశ్రమ‌కు చెందిన కాజోల్, ర‌వీనా టాండ‌న్, బిపాసా బ‌సు, సోనాలి బింద్రే, శిల్పా శెట్టి త‌దిత‌రులు ఈ ప‌ర్వ‌దినం రోజు త‌మ భ‌ర్త బాగుండాల‌ని పూజ‌లు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. కార్తిక మాసంలోని పౌర్ణమి తర్వాత నాలుగు రోజులకు వచ్చే ఈ పండుగ కాజ‌ల్‌కు తొలి పండుగ‌గ కాగా, ఈ వేడుక‌ని ఎంతో ఉత్సాహంతో జ‌రుపుకుంది. కాజ‌ల్ ఎరుపు రంగు చీర‌, అదే రంగు మాస్క్ ధ‌రించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తొలి క‌ర్వా చౌత్ పండుగ అని గౌత‌మ్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది.

కాజ‌ల్ షేర్ చేసిన మ‌రో ఫొటోలో కాజ‌ల్ సోద‌రి నిషా అగ‌ర్వాల్ తన బావ‌కు గోరింటాకు పెడుతూ క‌నిపించింది. ఈ ఫొటో కూడా నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కాగా, అక్టోబ‌ర్ 30న పెళ్లిపీట‌లెక్కిన కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌ల కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. గృహ ప్ర‌వేశ వేడుక‌కి సంబంధించిన పోటోల‌ను షేర్ చేసిన గౌతమ్‌ ‘‘కొత్త ప్రారంభాలకు శ్రీకారం. నా భార్యతో మా కొత్త ఇంట్లో..’’ అంటూ పోస్ట్‌ చేశారు.