మేము ఫేమస్ రీసౌండ్ గట్టిగానే

థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూసేది ఎక్కువగా యూత్ ఉంటారు. ఓపెనింగ్స్ కూడా వారితోనే వస్తాయి. అందుకే ఎక్కువగా వారిని దృష్టిలో ఉంచుకొని దర్శకులు సినిమాలు చేస్తూ ఉంటారు. యూత్ కి ఎమోషనల్ గా కనెక్ట్ కావాలి. లేదంటే సినిమా చూస్తున్నంత సేపు స్టొరీకి వారికి రిలేట్ చేసుకోవాలి. అలా ఉంటే కచ్చితంగా హిట్ అయిపోతుంది. ఈ బేసిక్ ఫార్ములాని యంగ్ జెనరేషన్ దర్శకులు పట్టుకున్నారు.

అందుకే యూత్ టార్గెట్ గానే వారు కథలని తెరపై ఆవిష్కరిస్తున్నారు. అలా ఇప్పుడు వస్తోన్న మరో చిత్రం మేము ఫేమస్. చిన్న సినిమాగానే వస్తోన్న ఈ మూవీతో యుట్యూబ్ కంటెంట్ తో ఫేమస్ అయిన చాయ్ బిస్కెట్ బిగ్ స్క్రీన్ పైకి వస్తోంది. అలాగే లహరి ఫిలిమ్స్ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం అయ్యింది. సుమంత్ ప్రభాస్ దర్శకత్వం వహిస్తూ మేము ఫేమస్ సినిమాలో హీరోగా నటించాడు.

ఎలా అయిన తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి గట్టిగానే ట్రై చేశాడు. దానికి తగ్గట్లుగానే సినిమాని తనదైన స్టైల్ లో షార్ట్ వీడియోల ద్వారా సోషల్ మీడియాలో అందరికి చేరువ చేశాడు. ఇక సెలబ్రిటీలు కూడా మేము ఫేమస్ ని ప్రమోట్ చేయడానికి ముందుకొస్తూ ఉండటం విశేషం. మొత్తానికి మేము ఫేమస్ విషయంలో హీరో కమ్ డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ మూవీ రిలీజ్ అవుతోన్న థియేటర్స్ లో టికెట్ ధరలు కూడా అందుబాటులో ఉంచడంతో ఎక్కువ మంది కాలేజీ యూత్ ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంది. యూత్ కి కనెక్ట్ అయ్యే అంశాలతో పాటుగా ఫ్యామిలీకి రీచ్ అయ్యే ఎలిమెంట్స్ కూడా మేము ఫేమస్ లో పుష్కలంగా ఉన్నాయంట. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ జనాల్లోకి భాగా వెళ్ళిపోయాయి.

గీతా ఆర్ట్స్ నేరుగా ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయడానికి ముందుకు రావడమే ఈ సినిమాకి పెద్ద సక్సెస్ అని చెప్పాలి. మరి చాయ్ బిస్కెట్, లహరి ఫిలిమ్స్ ని ఈ మూవీ ఏ రేంజ్ లో టాలీవుడ్ లో ఫేమస్ చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.