బన్నీకి అవార్డుతో అల్లువారింట మొదలైన సంబరాలు!

జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో అల్లు వారింట సంబురాలు మొదలయ్యాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమాలో తొలి నేషనల్‌ అవార్డు అందుకున్న హీరో బన్నీ కావడంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడంతో అల్లు వారింట సంబురాలు మొదలయ్యాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన తెలుగు సినిమాలో తొలి నేషనల్‌ అవార్డు అందుకున్న హీరో బన్నీ కావడంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. పుష్ప రాజ్‌గా ఏడాదినర్ధం కిందట ఇండియా బాక్సాఫీస్‌ను ఊపేసి.. ఇప్పుడు ఇండియా మొత్తం తనవైపు చూసేలా చేసుకున్నాడు.

ఈయన హీరో ఏంట్రా అనే స్థాయి నుంచి హీరో అంటే బన్నీ రా అనే స్థాయికి రావడం, ఇప్పుడు ఏకంగా నేషనల్‌ అవార్డు గెలుచుకోవడం ఆయన పట్టుదల, శ్రమకు నిదర్శనం. ఇక సోషల్‌ విూడియాలో బన్నీపై ప్రశంసల ప్రవాహం కొనసాగుతుంది. సినీ ప్రముఖులు సహా రాజకీయ నాయకులు బన్నీపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బన్నీ తన ఇంట్లో ప్రైవేట్‌ పార్టీని ఏర్పాడు చేశాడు. కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు ఈ పార్టీకి హాజరయ్యారు. బన్నీకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన పుష్ప థీమ్‌తో ఈ పార్టీ జరిగింది. గంధపు చెక్కల లారీ, పుష్పలో బన్నీ వాడిన గొడ్డలి, తగ్గేదేలే అంటూ పుష్ప థీమ్‌ను పార్టీలో ప్రదర్శించారు.

ప్రస్తుతం ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. సుకుమార్‌ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా బాక్సాఫీస్‌ నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. అసలెలాంటి ప్రమోషన్‌లు చేయకుండా హిందీలో వంద కోట్లు కొల్లగొట్టి బన్నీకు నార్త్‌లో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించిపెట్టింది.ఇంకా రిలీజ్‌ డేటు కూడా ఖరారు కానీ పుష్ప`2 పై ప్రేక్షకుల్లో మాములు అంచనాల్లేవు.

ఎప్పుడొచ్చిన బంపర్‌ హిట్టవడం ఖాయం అని అప్పుడే బాక్సాఫీస్‌ లెక్కలు కూడా వేసేస్తున్నారు. బన్నీ ఈ సారి వెయ్యి కోట్లు కొల్లగొట్టడం పక్కా అని ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. దానికి తగ్గట్టే సుక్కు సైతం సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లేలా ఎª`లాన్‌ చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌ వీడియో టాలీవుడ్‌తో సహా అన్ని వుడ్‌లలోనూ సంచలనాలు సృష్టించింది. జస్ట్‌ గ్లింప్సే ఆ రేంజ్‌లో ఉంటే సినిమా ఇంకా ఏ లెవల్లో ఉండబోతుందో అని తెగ ఆసక్తితో ఉన్నారు.