ఓరీ దేవుడా ఇదెక్కడి విడ్డూరం.. డ్రగ్స్ కేసులో హీరోయిన్ బాగోతం బట్టబయలు

CCB Questions Avout Sanjjana Galrani Secret Marrige

కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో బుజ్జిగాడు ఫేమ్ సంజనా గల్రానీ అరెస్టైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే డ్రగ్స్ కేసుకు సంబంధించి విచారిస్తుండగా.. ఓ కొత్త విషయం బయటకు వచ్చింది. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ప్రశ్నలకు సంజనా అవాక్కయినట్టు తెలుస్తోంది. అరెస్ట్ చేసినప్పుడు పెళ్లి అయిందా అని అడిగితే కాలేదని చెప్పిందట సంజనా. కానీ మళ్లీ విచారణ చేసినప్పుడు సీసీబీ చూపించిన ఆధారాలకు సంజనా కంగుతిన్నట్టు సమాచారం.

CCB Questions Avout Sanjjana Galrani Secret Marrige
CCB Questions Avout Sanjjana Galrani Secret Marrige

ఏడాది క్రితం ఆమె పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. విచారణలో ఆ ఫొటోను చూపడంతో ఆమె షాక్ అయిందట. అజీజ్‌ పాషా అనే వైద్యున్ని ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అతడు బెంగళూరులో ప్రముఖ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడట. పోలీసులు సాక్ష్యాలన్నీ చూపడంతో సంజన పెళ్లైందని ఒప్పుకుందట.

అయినా ఇందులో దాచడానికి ఏం ఉందో అర్థం కావడం లేదు. పెళ్లి అయితే అయిందని చెప్పాలి, లేదా కాదని చెప్పాలి. ఇలా ముసుగులో గుద్దులాటలా చేయడంతో పోలీసులు ఆ వైపుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. ఏది ఏమైనా కన్నడలో ప్రస్తుతం డ్రగ్స్ రాకెట్ కలకలం రేపుతోంది. ఇందులో స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం ఉన్నారని టాక్ వినిపిస్తోంది.