ఇప్పుడు ఉన్న రోజుల్లో ఓ సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికి ఆన్లైన్ లో బుకింగ్స్ కోసం అంతా ఎంతలా ఎదురు చూస్తూ ఉంటారో అందరికీ తెలిసిందే. మరి వీటిలో మన దేశంలోనే అతి పాపులర్ అయినటువంటి సంస్థలలో బుక్ మై షో కూడా ఒకటి. దాదాపు 90 శాతం బుకింగ్స్ సినిమాలకి మన దేశంలో ఇందులోనే జరుగుతాయి.
కానీ ఇందులో ఒక ప్రాబ్లమ్ కూడా ఉంది. పలు చిత్రాలకు అదనంగా 15 నుంచి 20 రూపాయలు టికెట్ పై ఛార్జ్ చేస్తారు. ఇది ఒక టికెట్ మీద ఓ మోస్తరు అనుకోవచ్చు కానీ మూడు నాలుగు టికెట్స్ బుక్ చేస్తే అదనపు చార్జెస్ తో ఇంకో టికెట్ వచ్చేస్తుంది. దీనితో ఇది సాధారణ ఆడియెన్స్ కి పెద్ద భారమే.
ఇక ఇప్పుడు తాజాగా అయితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేషన్ వారు షాకిచ్చినట్టు తెలుస్తుంది. దీనికి కారణం కూడా లేటెస్ట్ గా ఓ చోట జీవో 47 ని ఉల్లంఘించి 50 సాతంకి పైగా టికెట్స్ ఆన్లైన్ లో అమ్మడం మూలానే బుక్ మై షో యాజమాన్యంపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారట.
అలాగే వీరు ఛార్జ్ చేస్తున్న మొత్తంలో ఎగ్జిబిటర్స్ కి ఇవ్వడంలో పలు చిక్కులు పెడుతున్నారని అందరికీ సరిగ్గా కమిషన్స్ ఇవ్వడం లేదనే మాట. అలాగే ఇంకోపక్క ఇది ఎందుకు జరిగింది అంటే ఏపీలో తెచ్చిన కొత్త రూల్స్ అర్ధం కాక వారి నిబంధనలకు పలువురు ఎగ్జిబిటర్లు టికెట్లు ఎలా అమ్ముకోవాలో అర్ధం కాక అన్ని టికెట్లను ఆన్లైన్ లోనే పెట్టేశారని అందుకే ఇదంతా జరుగుతుందని మరో భోగట్టా.. మొత్తానికి అయితే ప్రస్తుతం రచ్చ ఇలా నడుస్తుంది.