పూజా హెగ్డే.. రష్మిక మందన్న ఎదురు దెబ్బలు తగిలితే తట్టుకుంటారా ..?

పూజా హెగ్డే.. రష్మిక మందన్న ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా క్రేజ్ తో ఉన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇప్పటికే తెలుగులో భారీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నారు. పూజా హెగ్డే .. ప్రభాస్ తో రాధే శ్యాం లో నటించింది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 250 కోట్లు. పూజా హెగ్డే నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా. అలాగే అఖిల్ అక్కినేని తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చేస్తోంది. ఈ రెండు సినిమాలు తప్ప పూజా చేతిలో మరో తెలుగు సినిమా లేదు.

ఇక రష్మిక మందన్న పుష్ప అన్న పాన్ ఇండ్యన్ సినిమా చేస్తోంది. సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉంది. అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. అంతేకాదు అల్లు అర్జున్ కూడా ఈ సినిమాతో బాలీవుడ్ లో భారీ సక్సస్ అందుకోవాలని చూస్తున్నాడు. అయితే రష్మిక మందన్న కూడా ఈ సినిమాతో ఫస్ట్ టైం బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.

కాగా పుష్ప కంటే ముందే రష్మిక బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసే అవకాశం దక్కించుకుంది. సిద్దార్థ్ మల్‌హోత్రా తో మిషన్ మజ్ఞు అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో వికాస్ భల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతోంది. అలాగే పూజా హెగ్డే సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా రణ్ వీర్ సింగ్ తో ఒక సినిమా చేస్తోంది. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా వెలుగుతున్న పూజా హెగ్డే, రష్మిక మందన్న ఇప్పుడు బాలీవుడ్ లో ఫోకస్ పెట్టడం బాగానే ఉంది కాని ఒకవేళ ఆ సినిమాల రిజల్ట్ తేడా కొడితే తట్టుకుంటారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.