థాంక్యూ, కళ్యాణ్ బాబాయ్.. వివాదం సద్దుమణిగే దిశగా బన్నీ వ్యాఖ్యలు!

పుష్ప 2 విడుదలైన మొదటి రోజే అత్యధిక వసూలు సాధించి రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 12,500 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. అయితే రెండు రోజుల్లో ఈ సినిమా 449 కోట్లు కలెక్ట్ చేయడం నిజంగా గ్రేట్. దీంతో శుక్రవారం పుష్ప 2 హైదరాబాదులో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

ఈ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న తెలుగు వారికి, భారతీయులకు, చిత్ర బృందానికి, నిర్మాతలకి, మీడియా వారికి ధన్యవాదాలు. దేశం నలుమూలల నుంచి మాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. అలాగే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినందుకు దర్శకుడు సుకుమార్ కి కూడా కృతజ్ఞతలు చెప్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ గారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి..

అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాబాయ్ గారికి సినీమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. నేను ఈ సినిమా తీయటానికి ముఖ్య కారణం ఈ సినిమా అందర్నీ గర్వంగా చెప్పుకునేలా చేస్తుంది అనే నమ్మకంతోనే అని చెప్పాడు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ని కళ్యాణ్ బాబాయ్ అని పిలవడంతో ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది.

గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ మెగా హీరోలను పక్కన పెడుతున్నారని, సొంత బ్రాండ్ కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు ప్రస్తావించడం లేదంటూ మెగా ఫ్యాన్స్ లోనే కొందరు విమర్శలు చేస్తూ ఉంటారు. సినిమా విడుదల అయిన వెంటనే దర్శకుడు సుకుమార్ నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలవడంతో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కళ్యాణ్ బాబాయ్ కి థాంక్స్ అని అల్లు అర్జున్ చెప్పడంతోనే వాళ్ల మధ్య ఎలాంటి విభేదాలు లేవు అనే విషయం అర్థమవుతుంది. ఒకవేళ ఉన్నప్పటికీ బన్నీ ఇప్పుడు చెప్పిన థాంక్స్ కి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

Allu Arjun Says Thanks to AP Deputy CM Pawan Kalyan : థ్యాంక్ యు బాబాయ్ - TV9