రెండు కోట్లు ఖర్చుపెట్టి భార్య భర్తడే కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బన్నీ.. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో స్టార్ హీరోగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందాడు. ఇక ఇటీవల విడుదలైన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు . ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండే అల్లు అర్జున్ తన కుటుంబం కోసం కూడా ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు.

సమయం దొరికినప్పుడల్లా భార్య పిల్లలతో కలిసి విదేశాలలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి కూడా అందరికీ సుపరిచితమైన వ్యక్తి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్నేహ రెడ్డి తన అందమైన ఫోటోలతో పాటు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హీరోయిన్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఇటీవల స్నేహారెడ్డి పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఒక ఖరీదైన బహుమతిని కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ తన ప్రియమైన భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు కోట్ల విలువ చేసి ఖరీదైన డైమండ్ రింగ్ ని కానుకగా ఇచ్చి స్నేహారెడ్డిని సర్ప్రైజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చి బన్నీ తన భార్య మీద ఉన్న ప్రేమని చాటుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కొందరు బన్నీ అభిమానులు భార్య కోసం రెండు కోట్లు ఖర్చు చేసినందుకు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం అల్లు అర్జున్ తన భార్యపై చూపిస్తున్న ప్రేమను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.