Allu Arjun: పెళ్లి జరిగి 14 ఏళ్ళు… స్నేహ రెడ్డి ఇప్పటికీ అత్తమామలతో ఉండటానికి అదే కారణమా?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలోనే సినీ ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధంలేని స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా వీరిద్దరూ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండటమే కాకుండా ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం అనే విషయం తెలిసిందే.

ఇలా ఈ ఇద్దరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి 14 సంవత్సరాలు అవుతుంది ఇలా ఇటీవల ఈ జంట తమ 14వ పెళ్లిరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు స్నేహ రెడ్డి పై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇటీవల కాలంలో ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు పెళ్లి జరిగిన వెంటనే తన భర్తతో వేరు కాపురం పెట్టాలని నిర్ణయించుకుంటుంది. ఇందుకు సెలబ్రిటీలు కూడా అతీతం కాదు. ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ ప్రైవేట్ లైఫ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ స్నేహ రెడ్డి మాత్రం ఉమ్మడి కుటుంబమే ముఖ్యమని భావించారు.

ఈ క్రమంలోనే తన పెళ్లి జరిగి 14 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు అల్లు అర్జున్ తో కలిసి వేరు కాపురం పెట్టాలనే ఆలోచన ఈమెకు రాలేదు. ఇప్పటికి తన అత్తమామలతో కలిసి ఒకే చోట ఉంటున్నారు. ఇలా అందరూ కలిసి ఉండటం వల్ల కుటుంబ విలువలు వ్యక్తుల మధ్య అనుబంధాలు ఆప్యాయతలు ఉంటాయని ఇవి పిల్లలకు నేర్పించడం కూడా ఎంతో ముఖ్యమని స్నేహ రెడ్డి ఇప్పటికీ కూడా తన అత్తమామలతోనే కలిసి ఉన్నారని తెలుస్తోంది.

ఇలా స్నేహ రెడ్డి తన భర్తను అర్థం చేసుకొని ఎప్పుడూ అత్త మామలతో కలిసి ఉండాలి అనే నిర్ణయం తీసుకొని నేటి జనరేషన్ కి ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలచిందనీ స్నేహారెడ్డిను అభిమానులు తెగ పొగుడుతున్నారు. ఇక ఈమె ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ కూడా హీరోయిన్లను మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈమె సొంతమని చెప్పాలి.