Allu Arjun: 40 మంది ఫ్రెండ్స్ తో బన్నీ బర్త్ డే పార్టీ..అసలు విషయం బయట పెట్టిన నవదీప్..!

Allu Arjun: టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమా ద్వారా ఊహించని రీతిలో విజయం అందుకున్నాడు. గంగోత్రి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఎన్నో సినిమాలలో నటించి ఇండస్ట్రీ లో స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీ కె పరిమితమైన అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప సినిమా ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అల్లు అర్జున్ ఇటీవల తన 40 వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

అల్లు అర్జున్ తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ఈ సెలబ్రేషన్స్ కు సంబంధించి కొన్ని వివరాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. హీరో నవదీప్ ఇటీవల ఈ విషయాన్ని తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా వెల్లడించాడు. అల్లు అర్జున్ 40 వ పుట్టిన రోజు వేడుకలను ప్లాన్ చేసింది అల్లు స్నేహ అంట. నవదీప్ ఇటీవల పుట్టినరోజు వేడుక కి సంబంధించిన కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ” 40వ పుట్టినరోజు కి 40 మంది బెస్ట్ ఫ్రెండ్స్. అతి తక్కువ సమయంలో అందరికీ గుర్తుండిపోయేలా స్నేహ రెడ్డి ప్లాన్ చేసింది. మరొక్క సారి హ్యాపీ బర్త్ డే బన్నీ ” అంటూ పోస్ట్ చేశాడు.

ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే పార్టీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. బన్నీ ప్రస్తుతం పుష్ప -2 సినిమా కోసం సన్నాహాలు మొదలు పెట్టాడు. తొందరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జ్ ఇటీవల కెజీఎఫ్-2 హీరో యష్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు.