త్వరలో సంజయ్ లీలా భన్సాలి కాంబినేషన్ లో బన్నీ మూవీ!

గత ఏడాదిలో విడుదలైన పాన్ ఇండియా మూవీ పుష్ప తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. పైగా పుష్ప 2 తో కూడా బన్నీ ప్రేక్షకుల ముందుకు మరోసారి రానున్నాడు. ఇదంతా పక్కన పెడితే తాజాగా బన్నీ మరో స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో మూవీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రముఖ బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని తాజాగా అల్లు అర్జున్ కలిసినట్లు తెలుస్తోంది. పైగా బన్నీ స్వయంగా ఆయన కార్యాలయానికి వెళ్తున్న వీడియో కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇక బన్నీ ఆ డైరెక్టర్ ను కలవడంతో భవిష్యత్తులో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుంది ఏమో అని రెండు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.