బ్రో థియేట్రికల్ బిజినెస్.. బాక్సాఫీస్ టార్గెట్ ఫిక్స్

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సముద్రఖని దర్శకత్వం వహించిన బ్రో సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా విడుదల కాబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. ఇక పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ మొదటిసారిగా కలిసి నటించడంతో ఈ సినిమాపై మొదటి నుంచి కూడా అంచనాలను గట్టిగానే ఉన్నాయి.

ఇక మార్కెట్లో కూడా ఈ సినిమాకు మంచి వ్యాల్యూ అయితే పెరిగింది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మెగా హీరోలు బలమైన టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు. ఏరియాలో వారిగా ఈ సినిమా థియేట్రికల్ గా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నైజంలో ఊహించని స్థాయిలో బ్రో సినిమా 30 కోట్ల రేంజ్ లోనే బిజినెస్ చేసినట్లు సమాచారం.

ఇక ఉత్తరాంధ్రలో 9.50 కోట్లు, గుంటూరులో 7.40 కోట్లు, నెల్లూరులో 3.40 కోట్ల వరకు ఈ సినిమా ధర పలికినట్లు సమాచారం. ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే బ్రో సినిమా 80.50 కోట్ల రేంజ్ లో అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 5 కోట్లు, ఓవర్సీస్ లో 12 కోట్ల వరకు ఈ సినిమా ధర పలికింది.

ప్రపంచవ్యాప్తంగా టోటల్ గా బ్రో సినిమా 97.50 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ట్యాగ్ అందుకోవాలి అంటే 98.50 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. అంటే దాదాపు 100 కోట్ల షేర్ దాటాల్సి ఉంటుంది. మరి సినిమా ఆ రికార్డును ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తుందో చూడాలి.