బ్రో ఓటీటీ అప్డేట్.. వచ్చేది ఎప్పుడంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం బ్రో సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలోనే విడుదల అయింది. ఈ సినిమాకు మొదటనుంచి కూడా ఒక డీసెంట్ లెవెల్ లోనే అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా ఫలితంని బట్టి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాస్త మిక్స్ డ్ టాక్ వస్తున్నప్పటికీ కూడా సినిమా ఫ్యాన్స్ కు అయితే మంచి కిక్ ఇచ్చింది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమా ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుంది అనే చర్చ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతుంది. బ్రో సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మొదట హాట్ స్టార్ కాస్త గట్టిగానే పోటీ పడినప్పటికీ నిర్మాతలకు నెట్ ఫ్లిక్స్ నుంచి మంచి డీల్ సెట్ సెట్ చేసుకొని ఫైనల్ చేసుకుంది. ఇక ఈ సినిమాను ఓటీటీ లో ఇప్పుడు స్ట్రీమింగ్ చేస్తారు అనే వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం వినిపిస్తు టాక్ ప్రకారం సెప్టెంబర్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓటీటీ లో విడుదల చేస్తే బెటర్ నెట్ ఫ్లిక్స్ సంస్థ నిర్మాతలతో చర్చించినట్లు సమాచారం. అయితే ఇంకా ఈ విషయంలో నిర్మాతల నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు. ఒకవేళ సినిమా ఫలితంలో ఏదైనా తేడా కొడితే మళ్ళీ మరోసారి చర్చలు జరుపుకుని మరి కొంత డబ్బు ఇచ్చి అడ్వాన్స్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది.

రూల్స్ ప్రకారం అయితే ఓటీటీ లో 50 రోజుల తర్వాతనే విడుదల కావాలి. మరి బ్రో సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 98.5 కోట్ల రేంజ్ లో అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక దాదాపు 100 కోట్లు షేర్ అందుకుంటేనే బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినట్లు లెక్క. మరి ఈ రికార్డును ఎన్ని రోజుల్లో బ్రో అందుకుంటుందో చూడాలి.