బ్రో… యాక్షన్ ఎక్కువ ఎక్స్ పెక్ట్ చేయొద్దు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ బ్రో. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. జులై 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

వినోదాయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కంప్లీట్ గా చేంజ్ చేసి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ యాంగిల్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ సిద్ధం చేశారు. స్టొరీ లైన్ సముద్రఖనిది అయిన కథనం మొత్తం మార్చేశారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పాత్ర టైమ్ కి రెప్లికేట్ గా ఉంటుంది. శివతత్వాన్ని రిప్రజెంట్ చేసేందుకు పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఇందులో ఉంటుందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించడంతో యాక్షన్ అంశాలకి ఎలాంటి తావులేదంట. ముఖ్యంగా కథనం మొత్తం ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో మిక్స్ అయ్యి ఉంటుందంట. కేవలం ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ సినిమా మొత్తానికి పెట్టినట్లు తెలుస్తోంది. అది కూడా మరీ ఎక్కువగా ఉండదని, కథలో భాగంగా సింపుల్ గా డిజైన్ చేసినట్లు టాక్.

గతంలో పవన్ కళ్యాణ్, వెంకటేష్ గోపాల గోపాల సినిమా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. బ్రో సినిమా కూడా ఇంచుమించు అదే తరహాలో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల మాట. కంటెంట్ లో ఎమోషన్స్ కి పెద్దపీట వేసినట్లు సమాచారం.

సోషల్ మెసేజ్ ఇచ్చేవిధంగా ఈ మూవీ కాన్సెప్ట్ ని సముద్రఖని సిద్ధం చేసుకున్నారంట. అయితే తెలుగు ప్రేక్షకులు ఏదైనా ఎంటర్టైన్మెంట్ కోణంలో చెబితే రిసీవ్ చేసుకుంటారు. ఈ కారణంగానే త్రివిక్రమ్ కథనం, డైలాగ్స్ మార్చినట్లు టాక్.