పీపుల్స్ మీడియం ఫ్యాక్టరీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ కలిసిన నటించిన బ్రో సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదట పాజిటివ్ టాక్ కందుకున్నప్పటికీ ఆ తర్వాత కలెక్షన్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో పెరగలేదు. పలు రాజకీయ అంశాలతో కూడా ఈ సినిమా కాంట్రవర్సీగా మారినప్పటికీ కూడా కలెక్షన్స్ ఏమీ పెద్దగా పెరగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
సినిమా విడుదలకు ముందే అనుకున్నంత స్థాయిలో అయితే హైప్ చేసుకోలేకపోయింది. దానికి తోడు టికెట్ల రేట్లు కూడా నామమాత్రంగానే అందుబాటులోకి తెచ్చారు. ఇక బెనిఫిట్ షోలు కూడా పడలేదు. ఇక మొత్తంగా ఈ సినిమా అయితే బాక్సాఫీస్ వద్ద మొదటి వారం తప్పితే మిగతా రోజుల్లో పెద్దగా ఆశ్చర్య పరిచే నెంబర్స్ ఏమి క్రియేట్ చేసుకోలేకపోయింది.
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏడు రోజుల్లో ఈ సినిమాకు 50 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వచ్చాయి. ఒక కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో 6 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో 6.80 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ దక్కించుకుంది. ఇక మొత్తంగా 7 రోజుల్లో బ్రో సినిమా ప్రపంచవ్యాప్తంగా 63.21 కోట్లు షేర్ 105.80 కోట్లు గ్రాస్ దక్కించుకుంది.
బ్రో సినిమా టోటల్ గా అయితే బాక్సాఫీస్ వద్ద 98 కోట్ల రేంజ్ లో అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఈ సినిమా కనీసం వంద కోట్లు అందుకుంటేనే సక్సెస్ అయినట్లు లెక్క. ఇక లేటెస్ట్ గా అందిన లెక్కల ప్రకారం అయితే ఇంకా 35 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్స్ వెనక్కి తీసుకు రావాల్సి ఉంది. కానీ సినిమా పరిస్థితి చూస్తూ ఉంటే ఈ వీకెండ్ వరకు మాత్రమే నిలదొక్కుకునేలా ఉంది. ఇక వచ్చే వారం డౌన్ అయితే 20 కోట్లకు పైగానే నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.