బ్రేకింగ్ బ్లాస్ట్ : “సలార్” ట్రైలర్ కి డేట్ సమయం ఖరారు..!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ఒకే ఒక్క సినిమా ఏదన్నా ఉంది అంటే అది నిర్మొహమాటంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సెన్సేషనల్ యాక్షన్ చిత్రం “సలార్” అనే చెప్పవచ్చు. కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సినిమాపై అనౌన్స్ చేసిన నాటి నుంచి ఓ రేంజ్ లో హైప్ నెలకొనగా..

ఇప్పుడు అయితే ప్రామిసింగ్ గా అయితే నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. ఇక ఈ భారీ చిత్రం నుంచి గత కొన్ని రోజులుగా క్రేజీ అప్డేట్ ట్రైలర్ విషయంలో వినిపిస్తున్నాయి. ఈ డిసెంబర్ 1న అయితే సినిమా ట్రైలర్ వస్తుంది అని టాక్ మొదలు కాగా చిత్ర యూనిట్ కూడా ట్రైలర్ సూన్ ని కన్ఫర్మ్ చేశారు.

ఇక ఈరోజు దీపావళి కానుకగా అయితే ప్రభాస్ పై ఒక ఊహించని పోస్టర్ రిలీజ్ చేసి ట్రైలర్ పై బ్రేకింగ్ బ్లాస్ట్ అప్డేట్ అందించారు. మరి దీనితో అయితే ఈ సినిమా ట్రైలర్ ను అనుకున్నట్టుగా డిసెంబర్ 1న అలాగే ఆరోజు సాయంత్రం 7 గంటల 19 నిమిషాలకి అయితే లాక్ చేస్తున్నట్టుగా మాసివ్ అప్డేట్ ని ఇప్పుడు ఇచ్చేసారు.

దీనితో సలార్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మాత్రం ఓ బిగ్గెస్ట్ అప్డేట్ అని చెప్పాలి. ఇక ఈ భారీ చిత్రంలో శృతి హాసన్, పృథ్వీ రాజ్ అలాగే జగపతిబాబు తదితరులు నటించగా ఈ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. 
https://x.com/SalaarTheSaga/status/1723558882566689106?s=20