బ్రేకింగ్ : జైల్లో బాబుని కలవడానికి డేట్ ఫిక్స్ చేసుకున్న పవన్..!

తెలుగు సినిమా ప్రముఖ హీరోగా చెలామణి అవుతూ భారీ సినిమాలు చేస్తూ వస్తున్నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక పక్క ఈ సినిమాలు మాత్రమే కాకుండా మరో పక్క తన పొలిటికల్ పార్టీ జనసేన కార్య కలాపాల్లో కూడా బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ లు ఓ పక్క జరుగుతున్నాయి.

ఇప్పుడు కూడా పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా షూటింగ్ లో జాయిన్ కాగా ఓ పక్క ఏపీ రాజకీయాల్లో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యిన సంగతి తెలుగు రాష్ట్రాల ప్రజలకి తెలిసిందే. కాగా ఈ సమయంలో పవన్ మంగళగిరికి వెళ్లడం అప్పుడు పెద్ద హై డ్రామా కూడా జరగడం అందరికీ తెలిసిందే.

మరి ఆ రోజు పవన్ అయితే నిజంగా చంద్రబాబు ని కలిసేందుకు వెళ్ళాడో లేదో కానీ ఇప్పుడు అయితే అఫీషియల్ గా బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు వచ్చింది. జనసేన పార్టీ సహా పవన్ సినిమా పి ఆర్ అయినటువంటి వేణు గోపాల్ కన్ఫర్మ్ చేసిన వార్త ప్రకారం..

పవన్ కళ్యాణ్ రేపు అనగా సెప్టెంబర్ 14న అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుని కలవాలని డిసైడ్ అయ్యారని అందులో భాగంగా తాను రేపు వెళ్లి కలిసి సంఘీభావం వ్యక్తం చేయనున్నారని తెలిపారు. ఇప్పటికే పవన్ యొక్క అరెస్ట్ ని తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఇక రేపు కలయిక అనంతరం పవన్ ఏ కామెంట్స్ చేస్తారో అనేది మరింత రసవత్తరంగా మారింది.
https://x.com/venupro/status/1701891964147581396?s=20
https://x.com/JanaSenaParty/status/1701892722595147783?s=20