Home News బ్ర‌హ్మానందంని విసిగించిన హైప‌ర్ ఆది..చిరాకుతో అరిచేసిన బ్ర‌హ్మీ

బ్ర‌హ్మానందంని విసిగించిన హైప‌ర్ ఆది..చిరాకుతో అరిచేసిన బ్ర‌హ్మీ

కామెడీ బ్ర‌హ్మానందం కామెడీకి న‌వ్వ‌ని వారు లేరు అంటే అతిశ‌యోక్తి కాదు. ఎన్నో సినిమాల‌లో అద్భుత‌మైన కామెడీతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన బ్ర‌హ్మీ ప్ర‌స్తుతం డ‌ల్ అయ్యారు. ఒక‌ప్పుడు ఆయ‌నకు హీరోకి స‌మానంగా రిక‌జ్నైజేష‌న్ ఉండేది. అంతేకాదు బ్ర‌హ్మానందం లేకుండా సినిమా కూడా ఉండేది కాదు. బ్ర‌హ్మానందంని బేస్ చేసుకొని క‌థ కూడా సిద్ధం చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి. తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో బ్ర‌హ్మానందం ఎంతో మంది క‌మెడీయ‌న్స్‌కు ఆరాధ్య గురువు. ఆయ‌న‌ని ఆద‌ర్శంగా తీసుకొని చాలా మంది క‌మెడీయ‌న్ వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు.

Aadhi Brahmi | Telugu Rajyam

జబ‌ర్ధ‌స్త్ కామెడీ షో తో ఇప్పుడు చాలా మంది క‌మెడీయ‌న్స్ తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెలుగుతున్నారు. ముఖ్యంగా హైప‌ర్ ఆది బుల్లితెర బ్ర‌హ్మీగా ప్రేక్షకుల‌ని ఎంత‌గానో అల‌రిస్తుంటాడు. హైపర్ ఆది వేసే పంచ్ డైలాగ్స్‌కు ఎవ‌రైన ప‌డిప‌డి న‌వ్వాల్సిందే. ప‌వ‌న్ ని చాలా ఇష్ట‌ప‌డే హైప‌ర్ ఆది ఓ సారి క‌త్తి మ‌హేష్‌ని దారుణంగా ట్రోల్ చేశాడు. ఇక హైప‌ర్ ఆది స్కిట్స్ అంటే అదొక బ్రాండ్ అన్న‌ట్టు ప్రేక్ష‌కులు ఫీల‌వుతూ ఉంటారు. అయితే ఒక్కోసారి ఆయ‌న స్కిట్స్ వివాదాల‌లోను నిలుస్తూ ఉంటాయి. సినిమాల‌లోను త‌న కామెడీ టైమింగ్‌తో ప్రేక్ష‌కుల‌ని న‌వ్విస్తున్న హైప‌ర్ ఆదికి ఓ టాక్ షోలో విచిత్ర అనుభ‌వం ఎదురైంది. ఓ సారి బ్రహ్మానందం కాల్ చేస్తే.. ఎవరో అనుకుని అత‌నిని ఆడుకున్నాడ‌ట‌.

బ్ర‌హ్మానందం కాల్ చేసి .. హ‌లో నేను బ్ర‌హ్మానందాన్ని మాట్లాడుతున్నా అన్నారు. దీనికి హైప‌ర్ అది అయితే ఏంటి ఇక్క‌డ హైప‌ర్ ఆది అంటూ విచిత్రంగా స‌మాధాన‌మిచ్చాడు . అప్పుడు మళ్ళీ అయ్యా నేను బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నా అంటూ కాస్త సీరియ‌స్‌గా అనే స‌రికి అస‌లు విష‌యం తెలిసింది. నిజంగానే బ్ర‌హ్మానందం కాల్ చేసార‌ని తెలుసుకొని తాను ఎందుకు అలా మాట్లాడాడో చెప్పాడు. నా ఫ్రెండ్స్ అప్పుడ‌ప్పుడు ఇలా ఆట‌ప‌ట్టిస్తుంటారు. ఇది కూడా అందులో భాగం అనుకొని అలా మాట్లాడ‌ను అని చెప్పి క్ష‌మాప‌ణ‌లు కోరాడ‌ట హైప‌ర్ ఆది. ఈ విష‌యం ఎప్పుడు గుర్తొచ్చిన చాలా న‌వ్వొస్తుంది అంటున్నాడు హైప‌ర్‌

Related Posts

తప్పదిక.. పెద్ద సినిమాలు తాడో పేడో తేల్చుకోవాల్సిందే.!

'లవ్ స్టోరీ' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి టాక్ సంపాదించుకుంది. కష్టకాలంలో తెలుగు సినిమాకి ఊరటనిచ్చింది 'లవ్ స్టోరీ' రిలీజ్. వాస్తవానికి 'సీటీమార్' ద్వారా ఈ వేవ్ రావల్సి ఉంది. 'సిటీమార్' తరహాలో...

బెజవాడ డ్రగ్స్ రగడ: టీడీపీ చిత్రమైన రాజకీయం

చీటికీ మాటికీ పెద్ద పెద్ద వివాదాలుగా చిన్న చిన్న విషయాల్ని మార్చడం రాజకీయ పార్టీలకి అలవాటే. సున్నితమైన విషయాల్లో సంయమనం పాఠించాల్సిన రాజకీయ పార్టీలు అక్కడ కూడా రాజకీయ లబ్ధిని చూస్తుంటాయి. అదే...

పాపం రేవంత్ రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంకా అదే ముసలం.!

కీలకమైన పదవి దక్కినా పాపం రేవంత్ రెడ్డికి టైమ్ కలిసొస్తున్నట్లు లేదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, తల పండిన నాయకులకే మింగుడు పడవు. రేవంత్ రెడ్డిలాంటి ఆవేశపరుడికి కీలకమైన పదవి దక్కడమంటే,...

Related Posts

Latest News