సోహెల్ కోసం బ్రహ్మీ బంపర్ ఆఫర్

ఇండస్ట్రీలో ఎదగాలి అంటే చాలా కష్టపడాలి. ఎవరికైనా సరే అవకాశం వస్తే గాని కెరీర్ యూ టర్న్ తిరగదు. అందుకోసం చాలా ఓపిక పట్టాలి. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పేర్లు చాలానే వైరల్ అవుతున్నాయి. స్టార్స్ కూడా టాప్ 5 కంటెస్టెంట్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక విజేతగా నిలిచిన అభిజిత్, అఖిల్ కంటే కూడా ఎక్కువగా సోహెల్ పేరు వైరల్ అవుతోంది.

గతంలో ఎప్పుడు లేని విధంగా సెలబ్రెటీలు కంటెస్టెంట్స్ కు మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇక సోహెల్ కు అయితే స్టేజ్ పైనే మెగాస్టార్ వారాల జల్లులు కురిపించిన విషయం తెలిసిందే. సినిమా తీస్తే సపోర్ట్ చేయడమే కాకుండా అవకాశం ఉంటే సినిమాలో ఒక గెస్ట్ రోల్ కూడా చేస్తానని అన్నాడు. నిజానికి సోహెల్ కు ఇది గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.

ఇక కామెడీ కింగ్ బ్రహ్మానందం కూడా సోహెల్ కు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ లేకుండా బ్రహ్మీ కూడా సోహెల్ సినిమాలో నటించడానికి రెడీగా ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని మెగాస్టార్ వాగ్దానం ఇవ్వడంతో సోహెల్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. అతనితో సినిమా చేయడానికి పలువురు నిర్మాతలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం. మరి సోహెల్ ఆ ఆఫర్స్ ను ఎంతవరకు యూజ్ చేసుకుంటాడో చూడాలి.