Bramhaji: వారి ఓవరాక్షన్ ముందు మా నటన సరిపోవటం లేదు…. బ్రహ్మాజీ పోస్ట్ వైరల్!

Bramhaji: సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలోనూ అలాగే సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటుడు బ్రహ్మాజీ ఒకరు. ఇక ఈయన ఎన్నో సినిమాలలో కమెడియన్ గా కూడా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. ఇలా నటుడిగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా బ్రహ్మాజీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు..

సోషల్ మీడియాలో కూడా బ్రహ్మాజీ చేసే పోస్టులకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. ఏ విషయం గురించి అయినా చాలా ఫన్నీగా కామెంట్లు చేస్తూ ఉంటారు అదేవిధంగా పోస్టులకు కూడా రిప్లై ఇస్తూ ఉంటారు అయితే కొన్నిసార్లు బ్రహ్మాజీ సరదా సరదాగా చేసే పోస్టులు కూడా వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి.

ఇకపోతే తాజాగా ఈయన చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఇందులో భాగంగా ఈయన బౌన్సర్లను ఉద్దేశించి పోస్ట్ చేశారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో కొంత ఫేం వస్తే చాలు సెలబ్రిటీలు ప్రత్యేకంగా బౌన్సర్లను పెట్టుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బౌన్సర్ల గురించి బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. బౌన్సర్ల ఓవరాక్షన్ ఎక్కువైంది అంటూ ఈయన ఈ పోస్ట్ చేశారు.

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా బౌన్సర్లు.. బౌన్సర్లు… బౌన్సర్లు వీళ్ళ ఓవరాక్షన్ ఎక్కువైపోయింది. వీరి ఓవరాక్షన్ ముందు మా యాక్షన్ సరిపోవటం లేదు ఏం చేయాలి. అవుట్డోర్ షూటింగ్ అంటే పర్లేదు కానీ.. సెట్స్ లో కూడనా అంటూ ఈయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల ఈయన ఇలాంటి పోస్ట్ చేయడంతో ఇది కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే ఈయన ఎవరి బౌన్సర్లను ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారనేది తెలియాల్సి ఉంది.