ఇన్నేళ్ళైనా మహేష్ విషయంలో మాట మార్చని బోయపాటి శ్రీను..!

టాలీవుడ్ సినిమా దగ్గర ఒకప్పుడు మాస్ సినిమాలు అంటే మొదట గుర్తుకు వచ్చే దర్శకుడి పేరు పూరి జగన్నాథ్ కానీ ఈ తర్వాత మాస్ లో సరికొత్త ఊర మాస్ ని పరిచయం చేసి తన సినిమాలకి సెపరేట్ బ్రాండ్ ని సెట్ చేసుకున్న దర్శకుడు మాత్రం బోయపాటి శ్రీను అనే చెప్పాలి.

కాగా బోయపాటి శ్రీను ఇప్పుడు తెరకెక్కించిన చిత్రం స్కంద రిలీజ్ అయ్యింది. అయితే దీనికి మాత్రం తాను రిలీజ్ కి ముందు ఎలాంటి ఈవెంట్ కానీ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యాకే ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. మరి అలా ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం తాను చేసిన కొత్త కామెంట్స్ అలానే ఎప్పుడో 2007, 8 సమయంలో చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారుతున్నాయి.

మహేష్ తో సినిమా చేయాలని తనకి కూడా ఉందని మహేష్ బాబు ఒక ఆల్ రౌండర్ హీరో మాస్ క్లాస్ తో పాటుగా యూత్ ఫామిలీ అందరికీ నచ్చుతాడు అన్ని సినిమాలకి కూడా మహేష్ సెట్ అవుతాడు అని బోయపాటి తెలిపారు. అయితే ఇంట్రెస్టింగ్ గా తాను అప్పుడు 2010 కి ముందు అదే కామెంట్ చేశారు అలాగే ఇప్పుడు 2023 లో కూడా అదే ఫీడ్ బ్యాక్ అందించారు.

దీనితో కొన్నాళ్ళకి మారిపోయే పరిస్థితులతో ఓ హీరోపై మాటలు మార్చే దర్శకుల కన్నా బోయపాటి నిజాయితీ కల స్టేట్మెంట్ తన ఫ్యాన్స్ కి ఎంతో నచ్చింది. దీనితో తమ కాంబినేషన్ లో సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు.