బోయపాటి పైత్యం..అబ్బో మామూలు లెవెల్లో లేదే.. 

తెలుగు సినిమా దగ్గర తన చిత్రాలకి ఒక సెపరేట్ మార్క్ ని సెట్ చేసుకుని అదే మార్క్ లో కొనసాగుతూ వెళ్తూ వచ్చిన దర్శకుల్లో మాస్ దర్సకునిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను కూడా ఒకరు. మరి బోయపాటి ఇపుడు తెలుగులో భారీ చిత్రాలు లాజిక్స్ లేకుండా తీస్తూ మాస్ ఆడియెన్స్ కి అయితే మంచి ట్రీట్ ఇస్తున్నాడు.

కాగా ఇప్పుడు రీసెంట్ గా చేసిన స్కంద విషయంలో మాత్రం ఒక్కసారిగా పరిస్థితి మారింది. సినిమా హిట్ అయితే ఇప్పుడు క్రెడిట్ అంతా కూడా తనదే ఇంకెవరిది లేదు అన్నట్టుగా మాట్లాడుతూ బోయపాటి కొత్తగా అనిపిస్తున్నాడు. అయితే రీసెంట్ గానే అఖండ, స్కంద సినిమాలు విషయంలో సంగీత దర్శకుడు థమన్ పై నోరు పారేసుకున్న బోయపాటి..

తన ముందు చిత్రం వీటికి ముందు చేసిన వినయ విధేయ రామ సినిమా కి కూడా కొన్ని కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. వీటితో అయితే తాను మంచి సినిమానే తీసాను కానీ ఇక్కడ ఆడియెన్స్ కి సినిమా చూడడం రాలేదు అని అన్నాడట. అంటే వినయ విధేయ రామ హిట్టే కానీ ఆడియెన్స్ దానిని చూడలేదు అంతే.

ఓసారి అందులో ట్రైన్ సీన్ ని పాము కాటేసే సీన్ ని మళ్ళీ బోయపాటి కి చూపిస్తే అసలు సినిమా ఎందుకు జనాలు చూడలేదు అనేది అర్ధం అవుతుంది. అలాంటి అవుట్ డేటెడ్ సీన్స్ తో జనాలకి మెంటల్ ఎక్కించే బోయపాటి ఇలాంటి కామెంట్స్ ఆడియెన్స్ పై చేయడం కరెక్ట్ కాదు. ఇంకొన్ని రోజులు ఆగితే ఇంకేం అంటారో ఇప్పుడు అర్ధం కాని పరిస్థితి.