తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘అతిథి’ సినిమాలో నటించిన అమృతా రావు బాలీవుడ్‌లో వివాహ్ వంటి హిట్ చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రముఖ ఆర్‌జే అన్మోల్‌తో ఏడేళ్ళ పాటు డేటింగ్‌లో ఉన్న అమృతా 2016లో అతనిని వివాహం చేసుకుంది. రీసెంట్‌గా తను గర్భవతి అన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అక్టోబర్ 19 న, అమృతా బేబి బంప్‌తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. మీకు పదో నెల.. మాకు తొమ్మిదో నెల. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం.అన్మోల్, నేను ఇప్పటికే మా 9 వ నెలలో ఉన్నాము . ఈ శుభవార్తను నా అభిమానులు మరియు మిత్రులతో మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము అని పేర్కొంది.
అమృతా రావు ఆదివారం పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చినట్టు అమృతారావు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఇద్దరు ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టు వారు పేర్కొన్నారు. అమృతాకు పండంటి మగబిడ్డ జన్మించాడని తెలుసుకున్న అభిమానులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు, సెలబ్రిటీలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అమృతా రావు పెళ్ళి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. భర్తే లోకంగా బ్రతికింది. ఇప్పుడు పండంటి పిల్లాడు పుట్టగా, కొద్ది రోజుల తర్వాత ఆమె ముఖానికి మేకప్ వేసుకొని అలరిస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, అమృతా తెలుగులో అతిథి,శౌర్యం చిత్రాల తర్వాత మరే తెలుగు చిత్రంలో నటించలేదు. తెలుగులోను ఈ అమ్మడు నటించాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. వారి అభిమానుల మొర అమృతా ఆలకిస్తుందా అనేది చూడాలి.