బాక్సాఫీస్ : ఏపీ/తెలంగాణ “సార్” ఫస్ట్ డే వసూళ్లు ఎంతంటే.!

ఈ మహా శివరాత్రి కానుకగా టాలీవుడ్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో తమిళ స్టార్ నటుడు ధనుష్ హీరోగా నటించిన బై లాంగ్వేజ్ సినిమా “సార్” కూడా ఒకటి. తమిళ్ వాథి గా రిలీజ్ అయ్యిన ఈ సినిమా తమిళ్ కన్నా తెలుగులో రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా మారింది. కాగా ఈ సినిమా అనుకున్న దానికన్నా బెటర్ రెస్పాన్స్ ని అందుకుంటున్నట్టుగా స్వయంగా సినిమా నిర్మాతే చెప్పగా.. 

ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఏపీ మరియు తెలంగాణ లో సార్ వసూళ్లు తెలుగు లో సూపర్ గా నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కలెక్షన్స్ మొదటి రోజు డీటెయిల్స్ చూస్తే నైజాం రీజన్ లో 1.8 కోట్లు గ్రాస్ అందుకోగా ఉత్తరాంధ్ర లో 55 లక్షలు ఇక మిగతా ఆంధ్ర అంతా కలిపి 1.67 కోట్లు గ్రాస్ ని సార్ వసూలు చేసింది.

దీనితో ఫస్ట్ డే ఐతే ఈ సినిమా నాలుగున్నర కోట్లకి పైగానే గ్రాస్ ని తెలుగులో అందుకోగా 2 కోట్ల మేర షేర్ ని రాబట్టి ధనుష్ కెరీర్ లో బెస్ట్ ఓపెనర్ గా ఈ సినిమా నిలిచింది. ఇక రెండో రోజు కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లే నమోదు అవుతున్నట్టుగా ట్రేడ్ సర్కిల్స్ కూడా చెప్తున్నాయి.

మొత్తానికి అయితే ధనుష్ ఆశించిన టాలీవుడ్ విజయం తనకి దక్కేసినట్టే అని చెప్పుకోవచ్చు. కాగా ఈ సినిమాలో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాని టేకప్ చేసాడు అలాగే సితార బ్యానర్ వారు నిర్మించారు.