బాక్సాఫీస్ కా “సలార్” 3 డేస్ వరల్డ్ వైడ్ వసూళ్లు.!

ఈ ఏడాదికి చివరి నెలలో వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో భారీ అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన మాసివ్ పాన్ ఇండియా చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎన్నో అంచనాలు నెలకొల్పుకోగా ఫైనల్ గా పాన్ ఇండియా భాషల్లో అయితే రిలీజ్ అయ్యింది.

మరి ఈ చిత్రం రిలీజ్ అయ్యాక రికార్డు ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకోగా ప్రభాస్ కెరీర్ లో సహా ఈ ఏడాదిలో ఒక రికార్డు ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా మొత్తం మూడు రోజులు రన్ ని కంప్లీట్ చేసుకోగా ఫస్ట్ రెండు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 300 కోట్ల మేర వసూళ్లు రాబట్టేసింది.

అయితే మూడో రోజు కూడా సలార్ ఏకంగా 100 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది. దీనితో జస్ట్ 3 రోజుల్లోనే సలార్ సినిమా ఏకంగా 400 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. మరి మొత్తం 4 రోజుల్లో ఈ చిత్రం 402 కోట్ల మాసివ్ గ్రాస్ ని కొల్లగొట్టినట్టుగా మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. ఇక నాలుగో రోజు సోమవారం కూడా క్రిస్మస్ హాలిడే కూడా బాగా కలిసి వచ్చింది. దీనితో ఈ సినిమా ఈరోజు కూడా భారీ బుకింగ్స్ ని నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

దీనితో సలార్ సినిమా నాలుగో రోజు కూడా గట్టి నంబర్స్ నే నమోదు చేస్తుంది అని చెప్పవచ్చు. కాగా ఈ నాలుగు రోజుల్లో కానీ 500 కోట్ల మార్క్ ని టచ్ చేస్తే ఇక అది మరో సంచలనమే అని చెప్పాలి. ఈ సినిమా మూడో రోజు హిందీలో కాస్త ఎక్కువ వసూళ్లే రాబట్టింది. చూడాలి మరి ఫైనల్ గా సినిమా ఎక్కడ ఆగుతుందో అనేది.