బాక్సాఫీస్ : “హనుమాన్” 2 రోజుల సెన్సేషనల్ వసూళ్లు.!

టాలీవుడ్ నుంచి వచ్చిన ఓ చిత్రం అయితే ఇప్పుడు అమెరికా నుంచి అనకాపల్లి వరకు కూడా బాక్సాఫీస్ తుక్కు రేగ్గొడుతుంది. ఆ సినిమానే “హనుమాన్”. తెలుగు నుంచి మొదటి సూపర్ హీరో సినిమాగా ఎన్నో అంచనాలు పెట్టుకొని వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు సెన్సేషనల్ రిపోర్ట్స్ అండ్ వసూళ్లతో వండర్స్ సెట్ చేస్తుంది.

ఇక ఈ సినిమా సంబంధించి ఇప్పుడు మరిన్ని డీటెయిల్స్ తెలుస్తున్నాయి. ఈ సినిమా మొదటి రోజునే వరల్డ్ వైడ్ గా గ్రాస్ 20 కోట్లకి పైగా రాబట్టేయగా రెండో రోజుకి మాత్రం ఊహించని విధంగా భారీ జంప్ ని తీసుకొని ఒక్క తెలుగు యూఎస్ లోనే కాకుండా హిందీలో కూడా పలు భారీ చిత్రాల రేంజ్ లో ఆక్యుపెన్సీ ని కనబరుస్తుంది అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు.

దీనితో రెండో రోజుకే ఈ సినిమా సుమారు 19 కోట్ల మేర గ్రాస్ ని అందుకున్నట్టుగా అంటున్నారు. దీనితో జస్ట్ రెండు రోజుల్లోనే హనుమాన్ చిత్రం 50 కోట్ల మార్క్ ని టచ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే ఊపులో ఈ సినిమా మరిన్ని రికార్డు నంబర్స్ సెట్ చేస్తుంది అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

ఈ మార్క్ బహుశా 200 కోట్ల దగ్గరకి వెళ్లినా ఎలాంటి ఆశ్చర్యం లేదని కూడా ఉన్న మాట. ఇక ఇంత గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా ఈ చిత్రం ఈ రేంజ్ లో వసూళ్లు రాబడుతూ ఉండడం అయితే చాలా మందికి మింగుడు పడడం లేదు. మొత్తానికి మాత్రం హనుమాన్ హవా ఈ రేంజ్ లో నడుస్తుంది.