ఇంట్రెస్టింగ్ : “కాంతారా 2” లో బాస్ బ్యూటీ..!

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర మాత్రమే కాకుండా టోటల్ పాన్ ఇండియా మార్కెట్ లో కూడా భారీ హైప్ తో ఉన్న పలు సీక్వెల్స్ లో కన్నడ నుంచి రాబోతున్న మరో సెన్సేషనల్ సినిమా “కాంతారా 2” కూడా ఒకటి. మరి మొదటి సినిమా అంచనాలు మించి భారీ హిట్ కావడంతో హిందీలో కూడా ఈ సినిమా పై మంచి అభిప్రాయం ఉంది.

అక్కడ కూడా సుమారు 100 కోట్ల మేర గ్రాస్ ని ఈ చిత్రం అందుకొని సెన్సేషన్ ని నమోదు చేసింది. ఇక ఈ భారీ సినిమా కి సీక్వెల్ ని అనౌన్స్ చేసిన తర్వాత హైప్ మరింత స్థాయికి వెళ్ళింది. ఈ సినిమాని కూడా ఆ సినిమా దర్శక హీరో రిషబ్ శెట్టి నే చేస్తుండగా ఈ సినిమా కాంతారా కి ప్రీక్వెల్ గా అంటే కాంతారా లో ముందు స్టోరీ గా తెరకెక్కించనున్నారు.

అయితే ఈ సినిమా కాస్టింగ్ లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో లేటెస్ట్ బాస్ బ్యూటీ వాల్తేరు వీరయ్య ఐటెం సాంగ్ లో కనిపించిన ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది స్వయంగా ఆమెనే పోస్ట్ చేయడం సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

రిషబ్ శెట్టి తో ఆమె కలిసి ఉన్న ఫోటో షేర్ చేసుకొని కాంతారా 2 లోడింగ్ అన్నట్టుగా పోస్ట్ చేసింది. దీనితో కాంతారా 2 లో ఈ గ్లామరస్ బ్యూటీ కూడా ఉన్నట్టే అనుకోవాలి. కాగా ఈ సినిమా ని కూడా ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే వారే నిర్మాణం వహిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాదిలోనే స్టార్ట్ అయ్యి వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.