డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తికి బెయిల్ మంజూరు అయింది. బాంబే హైకోర్ట్ రియాకు బెయిల్ ను మంజూరు చేసింది.
బుధవారం ఉదయం రియా పిటిషన్ పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్ట్.. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే తన సోదరుడు సోవివ్ కు మాత్రం బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అయితే.. సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యుల్ మిరండా, మరో వ్యక్తి దీపేశ్ సావంత్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక.. రియాకు లక్ష రూపాయల పూచీకచ్చుతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు కాస్త డ్రగ్స్ కేసు గా టర్న్ అవడం.. సుశాంత్ కు తన సోదరుడితో రియా డ్రగ్స్ ఇప్పించిందని రుజువు అవడంతో ఎన్సీబీ అధికారులు రియాతో పాటుగా ఆమె సోదరుడు, ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.
రియాను అదుపులోకి తీసుకున్న అనంతరం.. తనను విచారించి.. సెప్టెంబర్ 9న ముంబైలోని బైకుల్లా జైలుకు తరలించారు. అప్పటి నుంచి రియా అక్కడే ఉంటోంది.