బాలీవుడ్ ఐటెం సాంగ్స్ క్వీన్.. ఒకప్పుడు 50 రూపాయల కూలీ!

సినీ ప్రపంచంలో అడుగుపెట్టిన స్టార్స్ విలాసవంతమైన జీవితాన్ని చూసి అదృష్టవంతులు అనుకుంటాము. నిజమే కానీ వాళ్ళు ఆ అదృష్టం అందుకోవడానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డారు అన్నది చాలామందికి తెలియదు. ఇప్పుడు బాలీవుడ్ నటిగా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్న ఒక నటి ఒకప్పుడు పెళ్లిళ్లలో రోజుకి 50 ల కూలికి భోజనాలు వడ్డించేది అంటే ఎవరు నమ్మకపోవచ్చు కానీ ఇది నిజం. ఒక సక్సెస్ఫుల్ లైఫ్ వెనక ఎంతో శ్రమ,కష్టం పట్టుదల ఉంటాయి అని చెప్పటానికి మరొక ఉదాహరణ ఈమె జీవితం.

ఆమె మరెవరో కాదు ఐటెం సాంగ్స్ బాలీవుడ్ లో ఫేమస్ అయిన నటి రాఖీ సావంత్.1978లో ముంబైలో పుట్టిన రాఖీసావంత్ అసలు పేరు నెరు భేదా ఈమె తండ్రి ఒక పోలీస్ కానిస్టేబుల్. ఈమె తన పది సంవత్సరాల వయసులోనే పనిచేయడం ప్రారంభించింది. ముంబైలో పెళ్లిళ్లలో భోజనాలు వడ్డించే పని చేశానని అప్పుడు తనకి 50 రూపాయలు ఇచ్చేవారిని చెప్పింది రాఖి. ఆ తర్వాత తల్లిదండ్రులకి ఇష్టం లేకపోయినా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది ఈమె.

కాలేజీ పాస్ అయిన వెంటనే సినిమాల కి ఆడిషన్స్ ఇవ్వటం మొదలుపెట్టింది అయితే ఆమె నల్లగా ఉండటంతో చాలామంది సినిమాల్లోకి తీసుకునేందుకు నిరాకరించడంతో తన మొఖం, శరీరాకృతిని మార్చటానికి కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది తర్వాత 1997లో అగ్ని చక్ర సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. వెంట వెంటనే జోరు కా గులాం, ఏ రాస్తే హై ప్యార్ కే, చుర్రా హై తుమ్నే, వంటి చిత్రాలలో కనిపించింది. అయితే చూరాలియా హై తుమ్ నే సినిమాలోని మొహబ్బత్ హై మిర్చి అనే పాట ఆమె జీవితాన్ని మార్చేసింది.

తర్వాత బాలీవుడ్ లోనే ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది రాఖి. ఇక 2006లో బిగ్ బాస్ మొదటి సీజన్ లో కనిపించిన రాఖీ టాప్ ఫైవ్ లో నిలబడింది. 2017 లో కూడా మళ్లీ బిగ్ బాస్ హౌస్ లో కనిపించిన ఆమె ఈ షో తో మరింత పాపులారిటీని సంపాదించుకుంది.ఇక రాఖీ సావంత్ జీవితంలో ప్రేమ, పెళ్లి కలిసి రాలేదు. రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకుంది. ప్రస్తుతం రాఖీసావంత్ నికర విలువ 37 కోట్లు అని సినీ వర్గాల సమాచారం.