బాలీవుడ్ బజ్ – సెన్సేషనల్ ఫ్రాంచైజ్ లో ఆలియా భట్.?

alia-bhatt-3

బాలీవుడ్ సినిమా ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకుంటుంది. పలు ఇంట్రెస్టింగ్ అండ్ ఏక్షన్ సినిమాలు వస్తుండడంతో బాలీవుడ్ కాస్త బాక్స్ ఆఫీస్ దగ్గర రాణిస్తుండగా ఇక ముందు రోజుల్లో కూడా పలు భారీ అండ్ ఇంట్రెస్టింగ్ చిత్రాలు అయితే బాలీవుడ్ నుంచి రానున్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ ఏడాది బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన చిత్రం “పఠాన్” హిట్ తోనే మళ్ళీ బాలీవుడ్ పూర్వ వైభవం స్టార్ట్ కాగా ఈ సినిమాతో ఈ సినిమా నిర్మాణ సంస్థ కూడా ఇక నుంచి తమ సంస్థ నుంచి ఓ స్పై యూనివర్స్ చిత్రాలు ఫ్రాంచైజ్ లుగా వస్తాయి అని తెలిపారు.

దీనితో షారుక్ సినిమాలో సల్మాన్ తర్వాత సల్మాన్ సినిమాలో షారుక్ కనిపించడం అయితే ఫిక్స్ అయ్యింది. కాగా ఇదిలా ఉండగా ఈ ఫ్రాంచైజ్ లో అయితే ఈ స్టార్ హీరోస్ తో పాటుగా బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఇద్దరు ఆల్రెడీ కన్ఫామ్ అయ్యారు. మరి వారు టైగర్ లోని కత్రినా అలాగే పఠాన్ లో దీపికా పదుకొనె లు కాగా..

ఇప్పుడు వీరితో మరో టాలెంటెడ్ అండ్ గ్లామరస్ స్టార్ ఆలియా భట్ జాయిన్ కానున్నట్టుగా బాలీవుడ్ లో లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీనితో ఈ సెన్సేషనల్ ఫ్రాంచైజ్ లో అయితే ఆలియా కూడా యాడ్ కానుంది అని చెప్పాలి. ఇక వీటిపై అయితే మరిన్ని డీటెయిల్స్ రానున్నాయి. మరి ఆలియా అయితే రీసెంట్ గా బాలీవుడ్ లో రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని చిత్రంతో పలకరించింది.