బాలీవుడ్ బ్యూటిల రేట్లు మామూలుగా లేవు!

ఇటీవల కాలంలో హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కూడా వారు రెమ్యునరేషన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఒక సినిమా సక్సెస్ అయిందంటే వెంటనే రేట్లు గట్టిగానే పెంచేస్తున్నారు. ఇంకా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమా పడినా కూడా సినిమా రేంజ్ ను బట్టి ఐదు కోట్లకు పైగానే డిమాండ్ చేస్తున్నారు.

ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ అయితే 4 కోట్లకి ఎవరూ కూడా తక్కువ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు అని తెలుస్తోంది. అయితే సక్సెస్ లో ఉన్నవాళ్లు ఆ రెంజ్ లో అడిగితే తప్పులేదు. కానీ జాన్వీకపూర్ కూడా ఇంతవరకు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేకపోయినప్పటికీ కూడా అదే తరహాలో డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ బ్యూటీ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం చర్చలు జరుపినప్పుడు ఒకేసారి ఐదు కోట్లు అడిగిందట. కానీ నిర్మాతలు మాత్రం నాలుగు కోట్లుకు మించి ఒప్పుకోలేదట. మిగతా సదుపాయాల విషయంలో అయితే ఏమాత్రం ఇబ్బందుల రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారట. గతంలో అయితే RRR సినిమాకు ఆలియా భట్ కేవలం 5 కోట్లు మాత్రమే తీసుకుంది.

ఇక కీయరా అద్వాని మొన్నటి వరకు నాలుగు కోట్లు తీసుకోగా ఇప్పుడు ఆమె కూడా రెమ్యునరేషన్ ను ఐదు కోట్లను దాటించినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో నటించినందుకు గాను కృతి సనోన్ ఐదు కోట్లకు పైగానే డిమాండ్ చేసినట్లు సమాచారం. అలాగే ప్రాజెక్ట్ K లో ప్రభాస్ తో నటించేందుకు దీపిక పదుకొనే అందరికంటే ఎక్కువగా అత్యధిక స్థాయిలో 18 కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.