ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో మరణాల సంఖ్య ప్రతి ఒక్కరినీ షాక్ కి గురి చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా అగ్ర నటులలో కూడా కొందరు కరోనా ధాటికి బలవ్వగా. మరికొందరు బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ సూసైడ్ కేసు నుంచి రంగుల ప్రపంచంలో విషాద ఘటనలు ఏ మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా కోలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్, నటి విజే చిత్ర సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే.
చిత్ర మరణం వెనుక అసలు కారణం తెలియక ముందే మరో సినీ నటి మరణం విస్మయనికి గురి చేసింది. ఆమె మరెవరో కాదు సిల్క్ స్మిత జీవిత ఆధారంగా తెరకెక్కిన ద డర్టీ పిక్చర్ లో షకీలా పాత్రలో నటించిన ఆర్య బెనర్జీ. ఆమె శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నప్పటికీ ఘటన స్థలం సరికొత్త అనుమానాలను క్రియేట్ చేస్తోంది. కోల్కతాలో నివాసం ఉంటున్న శుక్రవారం ఆమె గదిలో సూసైడ్ కారణంగా మరణించినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గురించి తెలుసుకున్న సినీ నటులు ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఘటన స్థలంలో రక్తం మరకలు కూడా ఉన్నట్లు సమాచారం. ఆర్య వంటిపై గాయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయే ముందు ఆర్య ఆస్వస్థతో ఉందని వాంతులు కూడా చేసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. ఆర్య గత కొంతకాలంగా ఒంటరిగానే ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇక ఆమె ఇంట్లో పనిచేసేందుకు ఒక పనిమనిషిని నియమించుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.