అందరూ బాధపడ్డా మహేష్ ఫాలో అయ్యే ఆ ఒక్క సెంటిమెంట్ వల్లే సినిమా బ్లాక్ బస్టర్ అవుతోంది ..!

ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ అనేవి ఖచ్చితంగా లెక్కలోకి తీసుకుంటుంటారు. ఇక్కడ సక్సస్ ఎంత ముఖ్యమే.. కొన్ని సెంటిమెంట్స్ ని ఫాలో అవడం కూడా అంతే ముఖ్యమని చాలా మంది భావిస్తుంటారు. ఒక హీరోయిన్ డెబ్యూ సినిమా హిట్ అయితే లక్కీ హీరోయిన్ గా భావించి వరసగా అవకాశాలిస్తుంటారు. అదే మొదటి సినిమా గనక ఫ్లాపయితే మళ్ళీ ఇండస్ట్రీలో ఆ అమ్మాయికి హీరోయిన్ గా అవకాశాలివ్వడానికి ఎంవరూ అంతగా ఆసక్తి చూపరు.

Sitara gives first clap for dad Mahesh Babu's Sarkaru Vaari Paara, shoot  from Jan 2021 - Movies News

దర్శకుడైనా సక్సస్ లో ఉంటేనే నెక్స్ట్ సినిమా ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళు కూడా పడిన సందర్భాలున్నాయి. ఇక టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. కొన్నిటిని బలంగా నమ్ముతాడు. ముఖ్యంగా తన సినిమాల కి పెట్టే టైటిల్స్ విషయంలో ఎక్కువగా మూడు అక్షరాలే ఉండేలా చూసుకుంటుంటాడు. ఇది మహేష్ కి ఉన్న పెద్ద సెంటిమెంట్ చూస్తే నిజమని అందరూ నమ్మాల్సిందే. మురారి, అతడు, పోకిరీ, ఒక్కడు, మహర్షి లాంటి సినిమాలు ఇందుకు ఉదాహరణ. అలాగే శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి 5 అక్షరాల టైటిల్ కూడా మహేష్ ఖాతాలో మంచి హిట్ గా నిలిచాయి.

As Usual, Mahesh Babu Skips

ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోయో సినిమాకి కూడా 5 అక్షరాల తో ఉన్న సర్కారు వారి పాట టైటిల్ ని ఫిక్స్ చేశాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమా రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. అయితే ఎప్పటిలాగే మహేష్ ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరు కాలేదు.

ఇది కొంతమంది ఫ్యాన్స్ ని హర్ట్ చేసినప్పటికి ఇది మహేష్ సెంటిమెంట్. అందుకే రాలేదు. ఇలా చాలా సినిమాల ఓపెనింగ్స్ కి మహేష్ రాడు. ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ గా నిలుస్తాయి. ఇప్పుడు కూడా అదే ఫాలో అయ్యాడు కాబట్టి సర్కారు వారి పాట భారీ హిట్ ఖాయమని అందరూ నమ్ముతున్నారు.