రేంజ్ రోవర్ కొనుగోలు చేసిన బిత్తిరి సత్తి.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సాధారణంగా సెలబ్రిటీలు ఎంతో లగ్జరీ లైఫ్ గడపడానికి ఇష్టపడతారు అయితే ఈ మధ్యకాలంలో బుల్లితెర సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున ఖరీదైన వస్తువులను కారులను కొనుగోలు చేస్తున్నారు.ఇకపోతే విజయదశమి సందర్భంగా ఏదైనా కొత్త వస్తువులను కొనుగోలు చేస్తే శుభం కలుగుతుందని చెబుతుంటారు ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున విజయదశమి రోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. అయితే సినిమా సెలబ్రిటీలు కూడా ఈ విజయదశమి పండుగ రోజు పెద్ద ఎత్తున ఖరీదైన కార్లను కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ బిఎండబ్ల్యూ కారు కొనుగోలు చేయగా బిత్తిరి సత్తి సైతం ఏకంగా రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేశారు.

కమెడియన్ గా తన కెరియర్ ప్రారంభించిన బిత్తిరి సత్తి అనంతరం యాంకర్ గా మారిపోయారు. యాంకర్ గా ఎంతో మంది స్టార్ హీరోలను ఇంటర్వ్యూ చేస్తూ భారీగా అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా ఎంతోమంది హీరోలను ఇంటర్వ్యూ చేస్తూ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకునే బిత్తిరి సత్తి విజయదశమి పండుగ సందర్భంగా ఖరీదైన కారు కొనుగోలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.

ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు రాజకీయ నాయకులు ఉపయోగించే రేంజ్ రోవర్ కారును బిత్తిరి సత్తి కొనుగోలు చేశారు.ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ కారు ధర సుమారు రెండు కోట్లకు పైగా ఉంటుంది అయితే బిత్తిరి సత్తి కొనుగోలు చేసిన ఈ కారు ధర ఎంత అనేది తెలియాల్సి ఉంది.ఈ విధంగా ఈయన కొత్త కారును కొనుగోలు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.ఇక బిత్తిరి సత్తి రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేశారని తెలియగానే నేటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.