డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేసిన నెటిజన్. బిందు మాధవి కౌంటర్!

నాని హీరోగా నటించిన పిల్ల జమిందార్ సినిమాతో హీరోయిన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బిందు మాధవి ఆ సినిమా హిట్ అవ్వటంతో మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలలో హీరోయిన్ గా నటించినప్పటికీ ఆ సినిమాలు హిట్ అవ్వక ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ అమ్మడు చెన్నైకి తన మకాం మార్చింది. ఇక తమిళ్ లో ఎన్నో సినిమాలలో నటించిన బిందు మాధవి ఇటీవల ఓటీటి లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు సీజన్ లో పాల్గొనింది. ఈ సీజన్ లో బిందు మాధవి తన ఆట తీరుతో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇస్తూ బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారిగా టైటిల్ గెలుచుకున్న లేడీ కంటెస్టెంట్ గా గుర్తింపు పొందింది.

ఇక ప్రస్తుతం బిందు మాధవి బిగ్ బాస్ తో వచ్చిన పాపులారిటీ వల్ల పలు సినిమాలలో నటించే అవకాశాలు పొందటమే కాకుండా టీవీ షోలలో కూడా సందడి చేస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బిందు మాధవి యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ వీడియోస్ షేర్ చేయడంతో పాటు అప్పుడప్పుడు తన అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తన అభిమానులు అడిగి ప్రశ్నలకు బిందు మాధవి సమాధానాలు ఇస్తూ ఉంటుంది. అందరి సెలబ్రెటీల లాగే బిందు మాధవి గురించి నెటిజన్స్ కూడా పాజిటివ్, నెగిటివ్ కామెంట్లు చేస్తుంటారు.

తాజగా సోషల్ మీడియాలో బిందు మాధవికి చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఒక ఫొటోలో ఆమె డ్రెస్సింగ్ గురించి ఇక నెటిజన్స్ నెగిటివ్ కామెంట్ చేసింది. అయితే బిందు మాధవి ఆ నెటిజన్ కి దిమ్మ తిరిగే సమధానం ఇచ్చింది. ఇటీవల ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ.. బిందు మాధవి బిగ్ బాస్ లో పాల్గొన్నప్పుడు ఆమె అంటే నాకు చాలా గౌరవం ఉండేది. బిగ్ బాస్ లో ఉన్న అందరు స్కిన్ షో చేస్తుంటే బిందు మాధవి మాత్రం నిండుగా దుస్తులు వేసుకొని చాలా పద్ధతిగా ఉండేది. కానీ ఇప్పుడు ఈమె ధరించే దుస్తులతో ఆమె మీద ఉన్న గౌరవం పోయింది అంటూ కామెంట్ చేసింది. నెటిజన్ చేసిన కామెంట్ కి బిందు మాధవి రిప్లై ఇస్తూ.. ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం వారు వేసుకొనే దుస్తుల వల్ల వస్తుందంటే అటువంటి గౌరవం నాకు అవసరం లేదు అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ చాట్ కి సంబంధించిన స్క్రీన్ షాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.