పవర్ స్టార్ ఫ్యాన్స్ కి బిగ్ సర్‌ప్రైజ్.. వకీల్ సాబ్ టీజర్ వచ్చేస్తోంది ..!

శ్రీరామ్ వేణు దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా “వకీల్ సాబ్”. బాలీవుడ్ సూపర్ హిట్ పింక్ కు రీమేక్ గా ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల నిలిచిపోయిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా అలా అలా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. దాదాపు షూట్ పూర్తి కావచ్చింది. ఈ క్రమంలో వకీల్ సాబ్ కి సంబంధించిన ప్రమోషన్స్ కి దిల్ రాజు భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారట.

Happy Birthday Pawan Kalyan: Here's the intense motion poster of 'Vakeel  Saab' featuring Power Star

ఒకటి రెండు కాకుండా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలోపు ఫ్యాన్స్ కోసం వరస అప్‌డేట్స్ ఇవ్వాలని చూస్తున్నారట. ఈ క్రమంలోనే పవన్ కి సంబంధించి డిఫ్రెంట్ పోస్టర్స్, లిరికల్ సాంగ్స్, టీజర్ ని ప్లాన్ చేస్తున్నారట. దాదాపు 5-6 నెలలుగా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంది కూడా ఈ టీజర్ కోసమే. కాగా ఈ టీజర్ కు సంబంధించి లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేకర్స్ వకీల్ సాబ్ టీజర్ హిందీ, తమిళం కంటే కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సినిమాలోని కొన్ని కీలక షాట్స్ తో కట్ చేసినట్టు సమాచారం.

ఈ టీజర్ కి థమన్ అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నాడని ఈ టీజర్ తో సినిమా మీద భారీగా అంచనాలు పెరుగుతాయని తెలుస్తుంది. అయితే ఈ టీజర్ ను ఎప్పుడు విడుదల చేస్తారన్నది సస్పెన్స్ గా ఉంది. అయితే విజయదశమి సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ ని రిలీజ్ చేస్తారన్న టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారట. అలాగే పవర్ స్టార్ కమిటయిన సినిమాలన్ని వరసగా సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటున్నారు.