బిగ్ బాస్ 4:అప్ప‌టి వ‌రకు పెళ్ళి ముచ్చ‌ట్లు పెట్టుకున్న అఖిల్‌, మోనాల్.. అంత‌లోనే ఇరువురి మ‌ధ్య బిగ్ ఫైట్

అన్ని ప్రాంతీయ భాష‌ల‌లో స‌క్సెస్‌ఫుల్‌గా దూసుకెళుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులోను దూసుకుపోతుంది. ప్ర‌స్తుతం సీజ‌న్ 4 జ‌రుపుకుంటుండ‌గా, మ‌రికొద్ది రోజుల‌లో దీనికి ముగింపు కార్డ్ ప‌డనుంది. ప్ర‌స్తుతం ఇంట్లో స్ట్రాంగ్‌గా క‌నిపిస్తున్న అభిజీత్, అఖిల్‌, సోహైల్‌ల‌లో ఒక‌రు ట్రోఫీని ఎగిరేసుకుపోతారనే టాక్స్ బాగా వినిపిస్తున్నాయి. గ‌త మూడు సీజ‌న్స్‌ల‌లో మ‌హిళా కంటెస్టెంట్స్ ఎవ‌రు విజేతగా నిల‌వ‌లేదు, ఈ సారైన ఆ ఛాన్స్ మ‌హిళ‌ల‌కు ద‌క్కుతుంద‌ని అనుకున్న‌ప్ప‌టికీ, ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే అది సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు.

హౌజ్‌లో ప్ర‌స్తుతం ఉన్న మ‌హిళా కంటెస్టెంట్స్ హారిక, అరియానా, మోనాల్. వీరి ముగ్గురిలో అరియానా కాస్త స్ట్రాంగ్ అయిన‌ప్ప‌టికీ, విజేత‌గా నిలిచే అవ‌కాశం చాలా త‌క్కువ అని అంటున్నారు విశ్లేష‌కులు. ఇక ఈ క‌థ ఇట్లుంచితే బిగ్ బాస్ హౌజ్ ల‌వ్ బ‌ర్డ్స్ అఖిల్‌,మోనాల్‌లు గ‌త రాత్రి ఎపిసోడ్‌లో పెళ్లి ముచ్చ‌ట్లు పెట్టారు. వీరికి జ‌త‌గా సోహైల్ కూడా క‌లిసాడులేండి. అన్‌సీన్ ఎపిసోడ్‌లో నామినేష‌న్ కు ముందుకు అఖిల్‌, మోనాల్, సోహైల్ ఓ చోట గురించి పెళ్ళిళ్ల గురించి ముచ్చ‌ట పెట్టారు. అఖిల్ మాట్లాడుతూ.. నేను ల‌వ్ క‌మ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా. అది మా అమ్మ ఓకే అంటేనే. అమ్మ చెప్పే వ‌రకు త‌ప్ప‌కుండా వెయిట్ చేస్తాను అని అన్నాడు. దీనికి మోనాల్‌.. నువ్వు ఖచ్చితంగా మీ అమ్మ గారు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు.. ప్రేమ వివాహం చేసుకోవు అంటూ ఛాలెంజ్ విసిరింది

అనంత‌రం సోహైల్‌ని బ‌య‌ట‌కు వెళ్లాక నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావేమో అంటూ మోనాల్ అన్న‌ది. దానికి మ‌రో ఐదు సంవ‌త్స‌రాలు ప‌డ‌త‌దిలే. నా పెళ్లి విష‌యంలో నా ఫ్యామిలీకి త‌ప్ప‌క ఇంపార్టెన్స్ ఇస్తాను అంటూ సోహైల్ పేర్కొ్న్నాడు. ఇలా అఖిల్‌, సోహైల్, మోనాల్ మ‌ద్య కొద్ది సేపు పెళ్ళి చ‌ర్చ జ‌రిగింది. ఇది జ‌రిగిన కొద్ది గంట‌ల‌కు బిగ్ బాస్ నామినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లు పెట్ట‌డంతో శివంగిలా మారిన మోనాల్ అఖిల్‌, అభిజీత్‌ల‌ను నామినేట్ చేసి చెడుగుడు ఆడింది