మహర్షి సినిమాలో మహేష్‌ని టీజ్ చేసే క్యారెక్టర్‌లో కనిపించింది దివి. కాని ఈ అమ్మడిపై పెద్దగా ఎవరు అంతగా శ్రద్ధ పెట్టలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిందో ఆమె పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోయింది. ముఖ్యంగా తన నడుము అందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన దివి వారి గుండెలలో బాణాలు దించింది. హీరోయిన్స్‌కు ఏ మాత్రం తగ్గని ఫిగర్‌తో కైపెక్కించింది. హౌజ్‌లో ఉన్నంత సేపు తన అందాలతో ఊరిస్తూ వచ్చిన దివి ఓ రోజు తన ప్రేమ గురించి చెప్పి అందరి కంట కన్నీళ్ళు తెప్పించింది.
ఓ అబ్బాయితో ప్రేమలో పడ్డ దివి.. కొన్నాళ్ళ పాటు అతనితో రిలేషన్‌లో ఉంది. అతనితోనే పెళ్ళి పీటలు కూడా ఎక్కాలని అనుకుంది. కాని ఆ అబ్బాయి వాళ్ల తమ్ముడు చనిపోవడంతో పరిస్థితులు పూర్తిగా మారాయి. దివిని తన ఊరికి రమ్మని అబ్బాయి చెప్పడంతో కెరీర్ త్యాగం చేయలేక అతనికి బ్రేకప్ చెప్పింది. కెరియర్‌పై అంత ఫోకస్ ఉన్న దివి లవ్ చేసిన అబ్బాయిని కూడా వదులుకోవడంతో అభిమానులు అంతా తెగ ఫీలయిపోయారు. అయితే ఈ అమ్మడు రీసెంట్‌గా తాను లవ్‌లో పడ్డట్టు హింట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.
తన ఇన్‌స్టాగ్రామ్‌లో అందమైన ఫొటో షేర్ చేసిన దివి.. ఇదేమైనా న్యాయమా..
నీతో ఉన్న ప్రతీక్షణం నా గుండెను ఆపేసి మళ్లీ కొట్టుకునేలా చేస్తున్నావ్..
నాలో రేగే కోరికలను అది మీరి వచ్చే ఆలోచనలను.. తారుమారు చేస్తున్నావ్..
ఇప్పటిదాకా ఉన్న దివి వేరు.. ఇప్పుడు వచ్చాక వేరు అయిపోయేంత మత్తు జల్లేసావ్..
ఇదేమైనా న్యాయమా.. అంటూ కవిత రాసుకొచ్చింది. ఈ కవిత చదివాక అమ్మడి హృదయాన్ని ఎవరో దోచుకున్నారని అభిమానులు భావిస్తున్నారు