కింగ్ అక్కినేని నాగార్జున వ్యాఖ్యతగా చేస్తోన్న బిగ్ బాస్ తెలుగు 4 విజయవంతంగా పది వారాలు పూర్తి చేసింది. షోపై విమర్శలతో పాటు రేటింగ్ కూడా పెరిగుతోంది. ఈ రియాల్టీ షోలో 16 మంది పోటీదారులు డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వగా, ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చారు. సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్, గంగవ్వ, జోర్దార్ సుజాత, కుమార్ సాయి పంపన, దివి వద్దా, నోయెల్ సేన్, అమ్మ రాజశేఖర్, మెహబూబ్ ఇలా ఇప్పటివరకు 11 మంది బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎనిమిది మంది టాప్ కంటెస్టెంట్స్ ప్రస్తుతం ఇంట్లో ఉన్నారు. దీంతో ఈ సీజన్‌లో ఎవరు విజేత అవుతారో ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ నటుడు అభిజిత్ బిగ్ బాస్ తెలుగు 4 విజేత అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
కేవలం బిగ్ బాస్ ద్వారా తెలుగు రాష్ట్రాలలో ప్రాచుర్యం పొందిన అఖిల్ సార్థక్ కూడా రేస్‌లో ఉన్నాడు. అయితే సోషల్ మీడియా రిపోర్టుల ప్రకారం… ఈ సీజన్లో అఖిల్ విజేత అయ్యే ఛాన్స్ లేదని వారు తేల్చి చెబుతున్నారు. అతను వైఖరిని వీక్షకులు నిశితంగా గమనిస్తున్నారు. కుమార్ సాయి ఇంట్లో నుంచి వెళ్లే సయయంలో అతి చేసి..ఓవర్ యాటిట్యూడ్ చూపించాడు. అంతేకాదు పోటీలో నిలబడటానికి ఇతర కంటెస్టెంట్లను అఖిల్ వాడుకుంటున్నాడన్న ప్రచారం బాగా జరుగుతోంది. మోనాల్ తో ట్రాక్ తప్పితే అతడు వెలగబెట్టింది ఏంటి అన్నది నెటిజన్ల ప్రశ్న. ఇంతవరకు అఖిల్ అద్బుతంగా ఆడిన టాస్క్ ఒక్కటి చూపించండి అని వారు ప్రశ్నిస్తునన్నారు. కౌగిలింతలు, ముద్దులతో మాములు రోజుల్లో…నామినేషన్ వచ్చినప్పుడు మోనల్ పేరును వాడుకుని బచాయించడం అతడికి అలవాటుగా మారిందని విమర్శిస్తున్నారు.
ఇంకాస్త ఇంప్రూవ్ అయ్యి…ఆట బాగా ఆడితే సోహెల్ విన్నర్ స్థానం కోసం పోటీ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెహబూబ్ సహా మరికొందరు తారలు బయట నుంచి అతని కోసం ప్రచారం చేస్తున్నందున సోహెల్ మొదటి రెండు స్థానాల్లో ఉండవచ్చు. అంతేకాక సింగరేణి మద్దుబిడ్డ అని తనని తాను బాగా ప్రొజెక్ట్ చేసుకున్నాడు. దీంతో ఆ ప్రాంతాల నుంచి ఓటింగ్ బాగా పెరిగినట్లు సమాచారం అందుతోంది. మొత్తం అఖిల్ ను రేస్ నుంచి తప్పించారు నెటిజన్లు. మరి బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి.