బిగ్‌బాస్‌లో ఎవరూ ఊహించని విధంగా మూడో ఎలిమినేషన్ జరిగింది. ఈ వారం అందరూ కుమార్ సాయి లేదా మెహబూబ్ ఎలిమినేట్ అవుతారని లెక్కలు వేసుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా దేవి నాగవల్లి హౌస్ నుంచి బయటకు వచ్చే సరికి అందరూ షాక్ అయ్యారు. అందరికీ తెలిసిన స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావడంతో దేవి నాగవల్లి బిగ్ బాస్ హౌజ్‌లో కనీసం మరికొన్ని వారాలైనా ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ మూడో వారం ఎలిమినేషన్‌లో భాగంగా నామినేట్ అయిన ఏడుగురు సభ్యుల్లో దేవికి అత్యల్ప ఓట్లు రావడంతో ఎలిమినేట్ కాక తప్పలేదు.
దేవి ఎలిమినేట్ కావడం పట్ల హౌస్‌మేట్స్‌తో పాటు హోస్ట్ నాగార్జున సైతం ఆశ్చర్యపోయారు. ఎలిమినేట్ అవ్వడానికి గల కారణం ఏంటని దేవిని అడగగా.. బాధాతప్త హృదయంతో ఉన్న ఆమె కారణాలు తెలియవని తెలిసానే. లేడీ బిగ్‌బాస్ అవ్వాలని ఎంతో ఉత్సాహంగా హౌజ్‌లో అడుగుపెట్టిన దేవికి ఊహించని విధంగా ఎలిమినేట్ కావడంతో ఆమె చాలా సేపు షాక్‌లోనే ఉండిపోయారు. ఆ తర్వాత మిగతా ఇంటి సభ్యులకు విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇప్పటివరకు బిగ్‌బాస్ హౌస్ నుంచి ముగురుఎలిమినేట్ అయ్యారు. సూర్యకిరణ్, కరాటే కళ్యాణితో పాటు దేవి నాగవల్లి హౌస్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాలను వెతికేపనిలో పడ్డారు నెటిజన్లు. అయితే ఈ ముగ్గురిలో కామన్ పాయింట్స్ ఉన్నాయని అందుకే ఎలిమినేట్ అయ్యారని పేర్కొంటున్నారు.
బిగ్ బాస్ హౌజ్‌లోని మిగతా కంటెస్టెంట్ కన్నా పెద్దవారు కావడం, అందరపై ఆదిపత్యం ప్రదర్శించాలనే ఆలోచనతో ఉండటం అటు హౌజ్‌మేట్స్‌కు ఇటు ప్రేక్షకులకు నచ్చలేదు. అడగకున్నా సలహాలు ఇవ్వడం, టాస్క్‌ల్లో, ఇతరాత్రా విషయాల్లో దిశా నిర్దేశం చేయడాన్ని ప్రేక్షకులతో పాటు బిగ్‌బాస్ నిశితంగా గమనించారు. వయసులో పెద్దవారమని కాస్త కటువుగా ఉండటం,, తమ మాటలకు రెస్పెక్ట్ ఇవ్వాలని ఆర్డర్ చేయడం వంటివి ఎవరికీ నచ్చలేదు. అయితే ఈ విషయంలో గంగవ్వ ప్రవర్తిస్తున్న తీరు వేరే. తనకు తెలియని విషయంలో వేలు పెట్టని అయితే తెలిసిన విషయల్లో ఏ మాత్రం రాజీపడనని గంగవ్వ తేల్చిచెబుతుంది. చిన్నా పెద్దా అని తేడా లేకుండా వారితో సరదాగా కలసిపోతోంది.