బిగ్‌బాస్ .. కదిలిస్తే కన్నీళ్లే.. మొదటి రోజు హైలెట్ అయ్యింది వారే!!

bigg boss 4 telugu week 2 nomination process

బిగ్‌బాస్‌లో మొదటి రోజే రచ్చ రచ్చ జరిగింది. ఓ వైపు వచ్చినప్పటి నుంచి తన ఫ్యామిలీ, తండ్రి చనిపోయాడు అంటూ చెబుతూ మెనాల్ గజ్జర్ పాతాళగంగలా మారిపోయింది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లోనూ ఊరి విశేషాలు చెప్పమంటే ఏటో ఏటో వెళ్లిపోయి.. ఏదో ఏదో చెప్పి తెగ ఏడ్చేసింది. ఇక మోనాల్ ఏడ్పును చూసిన గంగవ్వ తట్టుకోలేకపోయింది. మధ్యలో సూర్య కిరణ్ వచ్చి టాపిక్ అది కాదు.. మీ ఊరి గురించి చెప్పు అని సలహా ఇవ్వడంతో హౌస్‌మేట్స్( మరీ ముఖ్యంగా అభిజీత్) రివర్స్ అయ్యారు.

ఎలాగోలా ఆమె తన ఫ్యామిలీ, ఇళ్లు, ఊరు గురించి పూర్తి చేసేసింది. ఇక ఈ విషయంపైనా కాసేపు రచ్చ జరిగింది. ఇదంతా ఓ వైపు అనుకుంటే నైబర్ రూంలో ఉన్న సోహెల్ హౌస్‌మేట్స్‌కు ఫోన్ చేయడం, ఆ ఫోన్‌ను సుజాత లిఫ్ట్ చేయడంతో గొడవ మొదలైంది. అటువైపు నుంచి బిగ్‌బాస్ ఫోన్ చేశాడేమో అని సుజాత కంగారు పడిపోయింది. సోహెల్ చెప్పిన ఐటెమ్స్‌ను పంపించాలని ఇంటి సభ్యులతో సుజాత చెప్పింది.

Bigg Boss Telugu 4 Day 1 Highlights Karate Kalyani Overaction
Bigg Boss Telugu 4 Day 1 Highlights Karate Kalyani Overaction

అక్కడే మొదలైంది అసలు కథ. ఈ విషయంలో కరాటే కళ్యాణి సుజాత మధ్య గొడవ మొదలైంది. ఎవరు? అని ఎందుకు అడగలేదు.. బిగ్‌బాస్ వాయిస్ నీకు తెలీదా? ఫస్ట్ ఫోన్ ఎత్తాలనే ఆరాటం ఉంది అంటూ ఏవేవో అనేసింది. దెబ్బకు సుజాత మొహం మాడిపోయింది. ఇక రెండో సారి సోహెల్ ఫోన్ చేసినప్పుడు ఎవ్వరూ ఎత్తకుండా చూస్తుండిపోయారు. కరాటే కళ్యాణి వచ్చి ఫోన్ ఎత్తి మాట్లాడింది. ఆమె కూడా అంతే తెగ భయపడుతూనే మాట్లాడింది.

 

ఇక నామినేషన్ ప్రక్రియలో ఏడు జంటలు పాల్గొన్నాయి. నామినేషన్ ప్రకియ అంతా ఒకెత్తు అయితే.. సుజాత వర్సెస్ కరాటే కళ్యాణి మాటల యుద్దం మరో ఎత్తు. ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వకుండా పెద్ద నోరు వేసుకుని అందర్నీ గదామాయించేసింది కరాటే కళ్యాణి. ఇక ఈమె చేసే ఓవరాక్షన్, చెప్పే మాటలకు హౌస్‌మేట్స్ కూడా ముసిముసి నవ్వులు నవ్వేశారు. అభిజీత్ అయితే ఏకంగా తల పట్టేసుకున్నాడు. కరాటే కళ్యాణి యాక్షన్‌కి.. అభిజీత్ రియాక్షన్ కేక అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ తెగ హల్చల్ చేస్తున్నాయి.

Bigg Boss Telugu 4 Day 1 Highlights Karate Kalyani Overaction
Karate Kalyani and Jordar Sujatha

ఫోన్ చేసింది బిగ్‌బాస్ కాదు.. పక్క రూం నుంచి సౌండ్స్ వస్తున్నాయి.. మాకు ఆ ఫుడ్ చాలురా అని ఓ అమ్మాయి అరుస్తోంది.. బిగ్‌బాస్‌ను రా అని ఎవరు అంటారు అని లాజిక్ కరెక్ట్‌గా పట్టేసిన నోయల్‌ను ఎవ్వరూ పట్టించుకోలేదు సరికదా.. ఆ విషయాన్ని చెబుతూ.. దేవీ నాగవల్లి నామినేట్ కూడా చేసిసింది. మెహబూబ్ అమ్మనాన్నల గురించి ఏడ్చేశాడు.

నామినేషన్ ప్రక్రియలో అంత గొడవ జరిగినా మళ్లీ అదే కంటిన్యూ చేస్తూ పోయారు. కరాటే కళ్యాణి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆక ఆమెను సముదాయించడంలో లాస్య మునిగిపోయింది. పుటేజ్ కోసం, ఆత్రం ఎక్కువగా ఉందని, ఎగ్జైట్ అవుతున్నావని ఇలా అన్ని రకాలు ఆరోపణలు చేయడంతో ఓ వైపు సుజాత  కుంగిపోయింది. మొత్తానికి ఫస్ట్ రోజు సూర్య కిరణ్ అతి, కరాటే కళ్యాణి వాగుడు, మోనాల్ ఏడ్పులు, సుజాత బాధపడటం జరిగాయి.