తినిపించాలంటూ మారాం.. అతి చేయడమే ఆరియానా గేమ్!!

ఆరియానా బిగ్‌బాస్‌లో చేసే అతి గురించి అందరికీ అర్థమైంది. నైబర్ రూం అంటూ సీక్రెట్ రూంలో ఉండి బాగానే ఓవరాక్షన్ చేసింది. సీక్రెట్ రూం నుంచి ఫోన్ చేసి హౌస్‌మేట్స్‌ను భయపెట్టాలని చూసి ఖంగుతింది. ఆమె అతికి నోయల్ అడ్డుకట్టవేశాడు. నోయల్ ఫోన్ కట్ చేయడంతో వారికి రోజంతా ఫుడ్ దొరకలేదు. ఇక హౌస్‌లోకి గొడవలు పెట్టుకునేందుకు ఆరియానా, సోహెల్ వచ్చారు.

Bigg Boss Telugu 4 Akhil And Karate Kalyani Feeds Ariyana GLory
Bigg Boss Telugu 4 Akhil And Karate Kalyani Feeds Ariyana GLory

సోహెల్ అందరినీ పరిచయం చేసుకుంటూ విషయాన్ని వివరించబోతోంటే.. సోహెల్‌ను పక్కకు లాక్కెళ్లింది. ఇప్పుడే పరిచయాలు వద్దు మన విషయం తేల్చుకున్నాకే పరిచయాలు చేసుకుందానమి సోహెల్‌ను అడ్డుకుని రెచ్చగొట్టింది. అక్కడ అందరి మధ్య వాగ్వాదం పెరిగింది. చివరకు వీరిద్దరికీ హౌస్‌మేట్స్ ఫుడ్ సమకూర్చారు. అక్కడ కూడా ఆరియానా తన అతిని వదల్లేదు. ఎవరో ఒకరు తినిపించాలని మారాం చేసింది.

అఖిల్ సర్తాక్ కరిగిపోయి తినిపించేశాడు. ఆమె చేసేది ఒకవేళ టాస్క్ అయి ఉంటే మనమంతా ఓడిపోతాం అలా చేయకని నోయల్, మిగతా హౌస్‌మేట్స్ సర్దిచెప్పారు. ఇక ఆపై కరాటే కళ్యాణి ముందుకు వచ్చి తినిపించింది. ఇలా తినిపించమని అడగడంతో హౌస్‌లో పెద్ద గొడవే జరిగింది. ఇదే విషయమై సోహెల్ ఆరియానాతో చెప్పే ప్రయత్నం చేశాడు. ఎందుకు అలా చేస్తున్నావ్ అని అడిగితే అదే తన గేమ్ అని, అలా అయితే ఫేమస్ అవుతాను.. అయితే బఫూన్ అవుతాను లేదా ఫేమస్ అవుతాను అలా చేయొద్దు అని చెప్పడానికి నీకు హక్కు లేదని సోహె‌ల్‌కు కౌంటర్ వేసింది. మొత్తానికి ఇలా ఏదో ఒకటి చేసి క్రేజ్ తెచ్చుకుందామని మంచి ప్లాన్‌తో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈమె పాచికలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.