బిగ్ బాస్ 4 : గంగవ్వని తక్కువ అంచనా వేసిన బిగ్ బాస్ అండ్ టీం కి బిగ్ షాక్

తెలుగు బుల్లితెర పాపులర్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 4లో 60 ఏళ్ల వయసులో ఎంట్రీ ఇచ్చి అందరికీ షాక్‌ ఇచ్చింది గంగవ్వ. సీజన్‌ ప్రారంభమైన అతికొద్ది రోజుల్లోనే స్టార్‌ కంటెస్టెంట్‌గా మారింది. తొలి రెండు వారాలు కాస్త ఇబ్బంది పడినా ఆ తర్వాత సెట్‌ అయింది. టాస్కుల్ల కూడా చాలా ఆక్టీవ్‌గా ఉంటూ తన సత్తా చాటుతోంది. అయితే పలు క్లిష్టమైన టాస్క్‌ల్లో కూడా ది బెస్ట్‌ ఇచ్చేసి బిగ్‌బాస్‌ అభిమానులకు ఫుల్‌ వినోదాన్ని అందిస్తోంది.

గురువారం ఎపిసోడ్ లో ఉక్కు హృదయం టాస్క్ లో మోనాల్ మీద గంగవ్వ ఫైర్ అవడం హైలెట్ అని చెప్పొచ్చు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కూడా గంగవ్వ మొన్న మనుషుల టీం లో మెహబూబ్, అఖిల్ ఎలా ప్రవర్తించారో ఇమిటేట్ చేస్తుంది. అలా గంగవ్వ ఇమిమేట్ చేయడం అదిరిపోయింది. గంగవ్వని అందరు తక్కువ అంచనా వేశారు కాని ఆమె మాత్రం హౌజ్ లో అందరితో ఈక్వల్ గా ఆటని ఆడుతుంది. ఈ ఏజ్ లో ఆమె యాక్టివ్ నెస్, సపోర్టింగ్, టాస్కులను అర్ధం చేసుకునే విధానం అంతా సూపర్ అనేస్తున్నారు.

బిగ్ బాస్ లో అందరికన్నా గంగవ్వని ఎక్కువ ఫాలో అవుతున్నారు. ఆమె నామినేషన్స్ కు వస్తే వెంటనే ఆమెను సేవ్ చేస్తున్నారు. ఇదే ఫామ్ కొనసాగిస్తే గంగవ్వ కచ్చితంగా టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది. గంగవ్వ తనంతట తాను హౌజ్ నుండి బయటకు వచ్చేస్తే తప్ప ఆమెకు మాత్రం బిగ్ బాస్ ఆడియెన్స్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.