అందరినీ మెప్పించిన కెవిన్‌!

‘బిగ్‌బాస్‌’ ద్వారా కెవిన్‌ సోషల్‌ మీడియాలో ఎక్కువగా పాపులర్‌ అయ్యాడు. బుల్లితెర ఆడియెన్స్‌కు, సోషల్‌ మీడియా నెటిజన్లకు కెవిన్‌ క్లోజ్‌ అయ్యాడు. తమిళ బిగ్‌ బాస్‌ మూడో సీజన్‌లో కెవిన్‌ తన ప్రవర్తనతో అందరినీ మెప్పించాడు. టాప్‌ 5 కంటెస్టెంట్‌గా నిలిచాడు. అయితే కెవిన్‌ అప్పటి నుంచీ సరైన సక్సెస్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.

కానీ ఇంత వరకు కెవిన్‌ వెండితెరపై బ్లాక్‌ బస్టర్‌ కొట్టలేదు. కానీ ఈ ఏడాది కెవిన్‌కు కలిసి వచ్చింది. ‘దా..దా.. ‘ చిత్రంతో కెవిన్‌ కోలీవుడ్‌లో అందరినీ ఆశ్చర్యపరిచాడు. లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించిన ‘దా.. దా…’ చిత్రంతో కెవిన్‌ హిట్‌ కొట్టేశాడు. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. దా…దా… సినిమాను ఒలింపియా మూవీస్‌ సంస్థ ఎస్‌ అంబేత్‌ కుమార్‌ సమర్పించగా, తెలుగులో శ్రీమతి నీరజ సమర్పిస్తున్నారు.

పాన్‌ ఇండియా మూవీస్‌, జె కె ఎంటర్టైన్మెంట్స్‌ సంయుక్తంగా రిలీజ్‌ చేస్తున్నాయి. ఈ మూవీకి ఎమ్మెస్‌ రెడ్డి నిర్మాతగా.. శ్రీకాంత్‌ నూనెపల్లి, శశాంక్‌ చెన్నూరు సహనిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు.

ఈ సందర్బంగా నిర్మాత ఎం ఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. తమిళంలో మంచి యూత్‌ఫుల్‌, లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచి కొన్ని కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన దా..దా.. చిత్రాన్ని ని పా..పా.. అంటూ తెలుగులో తీసు కొస్తున్నామని తెలిపాడు. ఎన్నో పెద్ద సంస్థలు పోటీ పడినా తెలుగులో ఇలాంటి సినిమాని మా సంస్థ తీసుకురావాలని భావించామని అన్నాడు.

అందుకే పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టామని తెలిపాడు. ఇప్పుడు ఫస్ట్‌ లుక్‌ని రిలీజ్‌ చేశాం.. అతి త్వరలో గ్రాండ్‌గా ట్రైలర్‌ లాంచ్‌ నిర్వహిస్తామని నిర్మాత పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ప్రోత్సహించడంలో ముందుంటారని, అలానే ‘పా…పా…’ని కూడా తెలుగులో మంచి బ్లాక్‌ బస్టర్‌ చేస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.