వెండితెర మీద అయినా వంద రోజులు ఉండాలనే ఆశతో ఎదురుచూస్తున్న సొట్ట బుగ్గల బిగ్ బాస్ పాప

bigg boss fame actor divi getting cinema offers

క్రేజీ రియాలిటీ షో ‘బిగ్ బాస్ ’ తెలుగు రాష్ట్రాలకి చేరుకొని నాలుగు సంవత్సరాలు అయ్యింది. తెలుగు ఆడియన్స్ కూడా ఓన్ చేసుకుని బాగా ఆదరిస్తున్నారు . అనేక మంది అనామకులు కూడా ఈ షోలోకి వచ్చిన తర్వాత బా ఫేమస్ అయిపోతున్నారు. ఆ ఫేమ్ ని ఉపయోగించుకుని వచ్చిన అవకాశాలని కొందరు చక్కగా ఉపయోగించుకుంటున్నారు.ఇదే మార్గంలో బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చిన తెలుగమ్మాయి దివి వడ్త్య. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వెళ్లడానికి ముందే తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉంది. మహేష్ బాబు ,వంశి కాంబినేషన్ లో వచ్చిన ‘మహర్షి’లో నటించారు.కొన్ని షోల‌లో మోడల్‌గానూ సందడి చేశారు. అయితే, ‘బిగ్ బాస్’ ద్వారా బుల్లితెర వీక్షకులతో పాటు వెండితెర ప్రేక్షకులకు దివి మరింత దగ్గరయ్యారు.ఆమె సొట్టబుగ్గల నవ్వుతో యువత ప్రేమలో పడిపోయారు .

bigg boss fame actor divi getting cinema offers
bigg boss fame actor divi getting cinema offers

బిగ్ బాస్ లో ఆమె ఆటకి ,మాటకి ముగ్దులైన ప్రేక్షకులు నటిగా మాత్రమే కాకుండా వ్యక్తిగా ఆమెను అభిమానిస్తున్నారు. ప్రేక్షకులలో దివికి బాగా క్రేజ్ వచ్చింది.దాంతో అవకాశాలు కూడా వెల్లువలా వస్తున్నాయి. గ్లామర్ తో పాటు అభినయం ప్రదర్శించగల కథానాయిక పాత్రలకు దివి మంచి ఆప్షన్ లాగా టాలీవుడ్ దర్శకులు, నిర్మాతలకి కనిపిస్తుందట . ఇప్పటికే కొన్ని సినిమాలకి ఆమెను సంప్రదించటం జరిగిందట. ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకుండా, మంచి కథలు చేయాలని దివి అనుకుంటోందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు.రెండు మూడు చిత్రాల్లో దివి కథానాయికగా ఎంపికైందనీ… పూర్తి వివరాలు అధికారకంగా బయటకి రావాలి. మంచి సినిమాల ద్వారా మన తెలుగమ్మాయి ఇండస్ట్రీ లో తానూ ఆశించిన స్థాయికి చేరుకోవాలని కోరుకుందాం.