అభిజిత్ మళ్లీ మొదలెట్టేశాడు.. మామూలోడు కాదుగా!!

Bigg Boss fame Abhijeet Went to Ride On New Year

బిగ్ బాస్ షో నాల్గో సీజన్ నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లందరూ హడావిడి చేసేస్తున్నారు. కానీ విజేతగా నిలిచిన అభిజిత్ మాత్రం తన లోకమేదో తానే అన్నట్టుగా ఉంటున్నాడు. తనకు సపోర్ట్ చేసిన వారిని వ్యక్తిగతంగా కలుస్తూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాడు. ఈ క్రమంలో నాగబాబు, విజయ్ దేవరకొండ, వెంకీ కుడుముల, శేఖర్ కమ్ముల ఇలా ఇండస్ట్రీలోని తన శ్రేయోభిలాషులు, స్నేహితులను కలుస్తూ తన గ్రాటిట్యూడ్‌ను ప్రకటించుకుంటున్నాడు.

Bigg Boss fame Abhijeet Went to Ride On New Year
Bigg Boss fame Abhijeet Went to Ride On New Year

అంతే కానీ మిగతా వారిలా సినిమా ప్రకటనలు, సినీ ఆఫర్ల గురించి మాత్రం ఎక్కడాప్రకటించడం లేదు. అభిమానులు ఎంతగా అడుగుతున్నా కూడా అప్డేట్ ఇవ్వడం లేదు. తాను ఇప్పుడు ఏమీ చెప్పలేనని ఎందుకంటే తాను ఇకపై చేసే సినిమాలు పెద్ద స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నానని, పెద్ద సినిమానే చేయాలని ఫిక్స్ అయినట్టు చెప్పుకొచ్చాడు. దాని కోసం ఎదురుచూస్తున్నాను.. త్వరలోనే అన్ని విషయాలు ప్రకటిస్తానని చెప్పుకొచ్చాడు.

అయితే సినీ అప్డేట్ల విషయం అలా ఉంటే.. అభిజిత్ తన అలవాట్లలో మునిగిపోయాడు. మళ్లీ రేసులు, రైడ్‌లు అంటూ మొదలెట్టేశాడు. తన స్పోర్ట్స్ బైక్ తీసుకుని మళ్లీ రైడ్‌కు వెళ్లి ఎంజాయ్ చేసినట్టున్నాడు. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా అభిజిత్ తన బైక్‌ను తీసుకుని అలా అలా షికార్లు కొట్టినట్టున్నాడు. ఇక తీరిగ్గా ఇంట్లోకి వస్తున్న అభిజిత్‌ను వాళ్ల అమ్మ కెమెరాలో బంధించినట్టుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంతకు ముందు అభిజిత్ రైడింగ్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.